తెలుగు రాష్ట్రాల్లో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. గతంలో ఎన్నడూ లేనంతగా ఏప్రిల్ నెలలోనే చాలా ప్రాంతాల్లో ఎండలు 45 డిగ్రీలు దాటడం మనం చూశాం. ఎప్పుడు జనంతా కళకళలాడే రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. ఫిబ్రవరి చివరి వారం నుంచే ఎండల తీవ్రత పెరుగుతూ వస్తోంది.


ఈ సమయంలో ఎన్నికలు రావడంతో అధికార పార్టీలు ఓ రకంగా కంగారు పడ్డాయి. సహజంగా వేసవిలో విద్యుత్తు వినియోగం ఎక్కువగా ఉంటుంది. అసలే ఎండలు. ఇంట్లో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, రిఫ్రజరేటర్లు ఇలా.. మీటరు గిర్రున తిరిగేలా చేసే గృహోపకరణాలు చాలానే ఉన్నాయి. ఈ సమయంలో ఏమాత్రం ఓవర్ లోడ్ పడినా ట్రాన్స్ ఫార్మర్ లు కాలిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ప్రజలకు ఇవేమీ పట్టవు. కరెంట్ పోతే చాలు ప్రభుత్వాన్ని తిట్టేస్తుంటారు. ఇదే తడవుగా ప్రతిపక్షాలను వీటిని అవకాశంగా మలచుకొని అధికార పార్టీపై పై చేయి సాధించాలని చూస్తోంది.


ఏపీలో ఎన్నికలు మేలో జరుగుతుండటంతో ఎన్నికల్లోపు సీఎం జగన్ చేతులెత్తేస్తారు.. డిమాండ్ సరఫరాకు సరిపడ కరెంట్ సరఫరా చేయలేరని ప్రతిపక్షాలు భావించాయి. కానీ వీరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ఏపీలో చిన్న చిన్న మరమ్మతులకు మినహా పది హేను నిమిషాలు కూడా కరెంట్ పోవడం లేదు. ఇప్పుడు ఎన్నికలు వ్యవధి గంటల్లోకి వచ్చేసింది. అయితే విద్యుత్తు డిపార్ట్ మెంట్ లో టీడీపీకి అనుకూలంగా పనిచేసే ఉద్యోగులు ఉన్నారనేది ఆది నుంచి వినిపిస్తున్న మాటే.


సరిగ్గా ఈ సమయంలోనే అంటే చాలా మంది ఓటర్లు పట్టణాల నుంచి ఓటేసేందుకు సొంతూళ్లకు వస్తుంటారు. ఇక్కడ కరెంట్ కోతలు విధిస్తే మన గ్రామాల్లో పరిస్థితి ఇలా ఉందా అని వాళ్లు భావించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తారు అనేది టీడీపీ ప్లాన్ కావొచ్చు. పైగా విద్యుత్తు అధికారులకు కరెంట్ పోయిందని వినియోగదారులు ఫోన్ చేస్తుంటే సరైన సమాధానం ఇవ్వడం లేదు. సరిగా స్పందించడం లేదు అని వినిపిస్తున్నాయి. ఇవి అంతింగా వైసీపీకి నష్టాన్ని తెచ్చి పెడతాయి.  ఇలాంటి వాటి చోట్ల ఆయా స్థానిక నేతలు, ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జీలు అప్రమత్తంగా ఉండాలని పలువురు సలహా ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: