ఏపీలో కీలకమైన ఘట్టానికి తెర లేచింది. ప్రచారంలో ఎంత ఆకట్టుకున్నా.. ఎన్ని సంక్షేమ పథకాలు కుమ్మరించినా.. ఎన్నికల్లో ఓటుకు నోటు ఇవ్వకుంటే మాత్రం ఓటు వేసే పరిస్థితి ఉండదు.  ఇప్పుడు ఇదే అంశం హాట్ టాపిక్ గా మారుతుంది. అందుతున్న సమాచారం మేరకు.. ఏపీలో కనీసం ఓటుకు రూ.వెయ్యి పంచుతున్నట్లు తెలుస్తోంది. గరిష్ఠంగా అయితే మాత్రం రూ.5 వేల వరకు చేరిందని గుసగుసలు ఆడుకుంటున్నారు. దీంతో ఏపీలో అన్ని విషయాల్లోను టఫ్ ఫైట్ నడుస్తోందని అర్థం అవుతోంది.


అంగబలం, అర్థబలం ఉన్న నాయకులకే పార్టీ టికెట్లు ఇచ్చింది. పార్టీపై ఎంత సానుభూతి ఉన్న అది ఓట్ల రూపంలో మారాలంటే నోట్లు పడాల్సిందే. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన పార్టీ అధినేతలు ఎవరైతే ఎక్కువ ఖర్చు పెడతారో వారినే ఎంపిక చేసి మరీ టికెట్లు ఇచ్చింది. ఇక శనివారం మైకులు మూగబోవడంతో.. ఇంట్లో గుసగుసలు వినిపించనున్నాయి.


సోమవారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ సమయంలో ఓటర్లకు డబ్బుల పంపిణీ కూడా క్లైమాక్స్ కి చేరిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎవరైతే నోట్లు పంచడంలో రాణిస్తారో వారికే విజయావకాశాలు మెండుగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం పంచుతున్న ఓట్ల లెక్కలు చూసుకుంటే.. రాజోలులో జనసేన అభ్యర్థి రూ.వెయ్యి పంచుతుంటే.. అధికార పార్టీ రూ.1500 వరకు పంచుతున్నారనే ప్రచారం సాగుతోంది.


రాజమండ్రి రూరల్ లో ఇప్పటికే వైసీపీ రూ.1500 ఇవ్వగా.. టీడీపీ రూ.1000 పంచి పెడుతునట్లు సమాచారం. ఇక సిటీ విషయానికొస్తే ఓ రెండు నోట్లు ఎక్కువగానే ఇస్తున్నార అంట. ఇక నెల్లూరులో ఓటుకు గరిష్ఠంగా రూ.5 వేల వరకు ఇస్తున్నారు అని టాక్ నడుస్తోంది. మంగళగిరి, కుప్పం, పిఠాపురం వంటి సీట్లలో విజయం ప్రతిష్ఠాత్మకం కాబట్టి ఓటర్ల డిమాండ్ ను బట్టి ప్యాకేజీల చొప్పున ఇస్తున్నారు. డూ ఆర్ డై స్థానాలు అయిన గుడివాడ, గన్నవరం, ఇంకా మంత్రలు స్థానాల్లో రూ.3000 నుంచి బేరం మొదలవుతుంది. దీంతో పాటు వెండి కుంకుబ బరిణెలు, చీరలు అదనం. మొత్తం మీద ఈ ఎన్నికలు చాలా కాస్ట్లీ గా మారాయని విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: