ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పులివెందులలోకి ఎంట్రీ ఇచ్చారు.. రేపటి రోజున జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో తమ ఓటు హక్కును సైతం వినియోగించుకునేందుకు ఈరోజు పులివెందులకు బయలుదేరారు. గత రెండు నెలలుగా ప్రజల మధ్యనే ఉంటూ ఎన్నికల ప్రచారంలో భాగంగా దుమ్ము దులిపేశారు.. నిన్నటి రోజున సాయంత్రం పిఠాపురం నియోజవర్గంలో ప్రచారాన్ని ముగింపుని పలికారు. ఈరోజు తాడేపల్లి నుంచి తన సొంత నియోజకవర్గం పులివెందులకు సాయంత్రం నాలుగు గంటల సమయంలో బయలుదేరబోతున్నారు సీఎం జగన్.


ఎన్నికల కోడ్ న నేపథ్యంలో పోలింగ్ జరిగేందుకు ముందుగా తన సొంత నియోజకవర్గానికి చెందిన వ్యక్తులే కాకుండా వేరే ప్రాంతాల నుంచి కూడా ఉండేందుకు అవకాశం ఉండదు.. అందు  కారణంగానే ఈరోజు రేపు మరో రెండు రోజులపాటు పులివెందులలోనే జగన్ ఉండబోతున్నారు. ఆయనతో పాటు తన భార్య వైయస్ భారతి కూడా పులివెందులకి వెళ్లబోతోంది. ఈరోజు రాత్రి పులివెందులలో ముఖ్యమంత్రి బస చేయబోతున్నారు  అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధంగానే ఉన్నాయి. అలాగే పోలీసులు కూడా.. మరొకవైపు పోలింగ్ జరుగుతూ ఉండడంతోపాటు జగన్ కూడా వస్తూ ఉండడంతో భద్రత ఏర్పాట్లను స్వయంగా అక్కడ జిల్లా ఎస్పీ పరిశీలిస్తున్నారు.


కేంద్ర బలాగాలతో పాటు నిఘా కూడా కట్టుదిడంతో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉన్నది.మరొకవైపు వర్షం కూడా కురిచే అవకాశం ఉందని ముందస్తు జాగ్రత్తలు వినిపించడంతో ఎన్నికల అధికారులు ఈవీఎంలు తడవకుండా ప్లాస్టిక్ కవర్లతో సైతం భద్రపరుస్తూ ఉన్నారు. సీఎం జగన్ పులివెందులలో ఓటు వేసిన అనంతరం పట్టణంలోనే ఉండి అక్కడ ఎన్నికల తీరును తెలుసుకోవడంతో పాటు అవసరమైన వాటిని దిశా నిర్దేశం ఇచ్చే విధంగా కూడా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.అనంతరం ఆయన తాడేపల్లికి వెళ్లే అవకాశం కూడా ఉన్నది.ఇదంతా ఇలా ఉండగా జగన్ ఇడుపులపాయ పులివెందుల పర్యటనకు సంబంధించి భద్రత చర్యలు కూడా తీసుకుంటున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: