
గడిచిన రెండు రోజుల క్రితం ధర్మం కోసం యుద్ధం అనే పోస్టర్తో ఒక టీజర్ వస్తుందంటూ చిత్ర బృందం వెల్లడించింది.. మొట్టమొదటి ఇది పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా పీరియాడికల్ సినిమా కావడంతో అభిమానులు చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నారు. అందరూ అనుకున్నట్టుగానే తాజాగా హరిహర విరమణ సినిమా నుంచి టీజర్ విడుదల అయింది. టీజర్ లో మొఘల్ కాలంలో అందరూ ప్రజలను దోచుకుంటు ఉంటే వాళ్ళని దోచుకోవడానికి ఒక దొంగ వస్తాడు 17వ శతాబ్దంలో పేదల పక్షాన పోరాడిన ఒక యోధుడి కథ అన్నట్లుగా చూపించారు.
మొత్తానికి హరిహర వీరమల్లు టీజర్ అయితే అదిరిపోయేలా కనిపిస్తోంది. పవన్ యాక్షన్స్ సన్నివేశాలలో కూడా అద్భుతంగా నటించినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి గ్రాఫిక్స్ వర్క్ అయితే జరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు టీజర్ చివరిలో చూపించారు.. టీజర్ తోనే ఒక్కసారిగా హరిహర వీరమల్లు సినిమా పైన భారీ హైప్స్ ఏర్పరిచిన డైరెక్టర్ క్రిష్ మరి ఏ మేరకు ఈ సినిమాని ఆకట్టుకునేలా ఉంటుందో చూడాలి మరి ఈ సినిమా రిలీజ్ డేట్ అని మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు. ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. హీరోయిన్గా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. బాబీ డియల్ కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.