ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ముందుగా వచ్చేది 'దే కాల్ హిమ్ OG' . ఈ సినిమా కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభంలో వేగంగా సాగింది కానీ, పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో బాగా బిజీ కావడంతో ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేశారు.ఇండస్ట్రీలో లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం, పవన్ కళ్యాణ్ OG సినిమా షూటింగ్ ను జూన్ 2024 చివర్లో మళ్ళీ కంటిన్యూ చేయనున్నట్లు సమాచారం తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. డేట్స్ సెట్టయితే మాత్రం రెండు వారాల్లో పవన్ కళ్యాణ్ వర్క్ ఫినిష్ అవుతుంది. ఇక మిగతా మ్యాటర్ అంతా కూడా డైరెక్టర్ సుజిత్ మరో రెండు నెలల్లో ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ అయితే ముందే మాట  ఇవ్వలేదు. ఎన్నికల రిజల్ట్ తరువాతే షూటింగ్ గురించి మాట్లాడతానని చెప్పాడు. ఇక ఈ సినిమా రిలీజ్ లో కూడా మార్పు రాకూడదని పవన్ కళ్యాణ్ నిర్మాతకు ఒక భరోసా ఇచ్చినట్లు సమాచారం తెలుస్తోంది. ఈ OG సినిమా యంగ్ ఫిల్మ్ మేకర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూడవ సినిమా.


ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇంకా అలాగే, ఇమ్రాన్ హష్మీ, శ్రీయా రెడ్డి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్ మరియు హరీష్ ఉతమన్ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.DVV దానయ్య నిర్మాణంలో ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న OG సినిమా సెప్టెంబర్ 27, 2024 న విడుదల కానుంది. ఎన్నికల ప్రచారంలో బాగా నిమగ్నమైన పవన్ కళ్యాణ్ తన రాజకీయ బాధ్యతలు పూర్తిచేసిన తర్వాత, ఈ సినిమాపై దృష్టి సారించనున్నారు. ఒకవైపు ఎన్నికల వేడి మరోవైపు OG బజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులను ఎంతగానో ఉత్సాహపరుస్తున్నాయి. OG ఎన్నో భారీ అంచనాలున్న సినిమాగా రానుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు ఏదైనా, OG సినిమా అప్డేట్స్ ఇంకా విడుదల రోజు అభిమానులకు మరో పెద్ద సంబరంగా నిలవనుంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: