అతిలోక సుందరి దివంగత నటి శ్రీదేవి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒకటికి మించి భాషలో ఎవరైనా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు వారిని పాన్ ఇండియా స్టార్ అని పిలవడం మొదలు పెడుతున్నారు. పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అయితే పాన్ ఇండియా అనే పదం తెర మీదకి రాకముందే శ్రీదేవి ఇక ఈ రికార్డును కొల్లగొట్టారు. తెలుగు తమిళం కన్నడ హిందీ భాషల్లో కూడా అవకాశాలను దక్కించుకొని అన్ని భాషల్లో అగ్ర కథానాయక హవా నడిపించారు.


 ఇక సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు శ్రీదేవి వారసురాలిగా అటు జాన్వి కపూర్ ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి రాణిస్తుంది. ఇప్పటికే బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న జాన్వికాపూర్ అటు టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఇక తెలుగు ప్రేక్షకులందరికీ పలకరించేందుకు సిద్ధమవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవరా మూవీలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది. మరోవైపు రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమాలోను ఇక అవకాశాన్ని దక్కించుకుంది అని చెప్పాలి.


 ఇకపోతే శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఇటీవలే తన తల్లికి ఇష్టమైన ఒక పని చేసింది. ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. తన తాజా సినిమా మిస్టర్ అండ్ మిసెస్ మహి రిలీజ్ కారణంగా హీరోయిన్ జాన్వి కపూర్ చెన్నైలోని ముప్పతమ్మాన్ గుడికి వెళ్లి దర్శించుకున్నారు. మాజీ నటి మహేశ్వరి ఆమెతో ఉన్నారు. అయితే దీనికి సంబంధించిన ఫోటోలు ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ గుడి తన తల్లికి అత్యంత ఇష్టమైన ప్రదేశమని వెల్లడించారు జాన్వి కపూర్. తల్లికి ఇష్టమైన పనిని జాన్వికపూర్ చేయడంతో అభిమానులు మురిసిపోతున్నారు. కాగా జాన్వికపూర్ ని తెలుగు తెరపై చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: