సాధారణం గా సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఏ విషయం సోషల్ మీడియాలోకి వచ్చిన అది తెగ హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే సినిమా సెలబ్రిటీల ప్రొఫెషనల్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకునేందుకు అందరూ తెగ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. దీంతో ఇక హీరో హీరోయిన్లకు సంబంధించిన పర్సనల్ విషయం తెరమీదికి వస్తే అందరూ దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది అని చెప్పాలి.


 అది సరే గానీ ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అనుకుంటున్నారు కదా.. ఇప్పుడు ఏకంగా పోకిరి సినిమా హీరో మర్డర్  కేసులో ఇరుక్కున్నాడు. ఇది కాస్త సంచలనం గా మారి పోయింది అని చెప్పాలి. అదేంటి పోకిరి సినిమా హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కదా. ఆయన మర్డర్ కేసులో ఇరుక్కోవడమేంటి.. అని ఒక్క  సారిగా షాక్ అవుతున్నారు కదా. అయితే పోకిరి సినిమా హీరోనే ఇలా మర్డర్ కేసు లో ఇరుక్కున్నాడు.


 కానీ టాలీవుడ్ లో పోకిరి సినిమా చేసిన మహేష్ బాబు కాదు.. పోకిరి సినిమాను రీమేక్ చేసిన మరో హీరో ఇలా మర్డర్ కేసులో ఇరుక్కోవడం తో అతని పోలీసులు అరెస్టు చేశారు. ప్రముఖ కన్నడ నటుడు చాలెంజింగ్ స్టార్ దర్శన్ ను బెంగళూరు పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. హత్య కేసు లో దర్శనం మైసూర్ పోలీసులు ఫార్మ్ హౌస్ లో ఇలా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అతడిని ప్రస్తుతం బెంగళూరు తీసుకొస్తున్నారు. చిత్రదుర్గకు చెందిన రేణుక స్వామి హత్య కేసుతో దర్శన్ కు ప్రత్యక్ష సంబంధం ఉందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందట. కాగా దర్శన్ ఎన్నో కన్నడ సినిమాల్లో నటించారు. మహేష్ బాబు హీరోగా నటించిన పోకిరి సినిమా అని కూడా కన్నడలో రీమేక్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: