పాన్ ఇండియా  స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 ఎ.డి.' ఈ చిత్రం పాన్ వరల్డ్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూన్ 27న థియేటర్స్ లో విడుదల కానున్న విషయం తెలిసిందే.వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీకి ఇప్పటికే ట్రైలర్ ద్వారా మంచి రెస్పాన్స్ వచ్చింది. హాలీవుడ్ స్టాండర్డ్స్ తో రూపొందిన విజువలైజేషన్, కంటెంట్ ప్రెజెంటేషన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.ఈ మూవీ పై ఫ్యాన్స్ లో కూడా అంచనాలు మాములుగా లేవు. ఈ మూవీ ట్రైలర్ చూసిన ప్రేక్షకులు మొదటి రోజు కల్కి భారీ వసూళ్లను రాబడుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ట్రేడ్ పండితులు కూడా ఈ మూవీ పై సానుకూల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ బిజినెస్ కూడా ఇప్పటికే పూర్తయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి.సినిమా ప్రమోషన్స్ విషయంలో మరింత జోరు చూపిస్తూ మూవీ యూనిట్ ప్రత్యేక ప్రయత్నాలు చేస్తోంది.


ఇందులో భాగంగా 'కల్కి' మూవీ నుండి భైరవ ఆంథమ్ ని విడుదల చేసింది. ఇందులో దిల్జీత్ దోసాంజ్ మరియు ప్రభాస్ ని ఎస్టాబ్లిష్ చేయడం విశేషం. భైరవ ఆంథమ్ లో ఇద్దరూ కూడా హైలెట్ అయ్యారు. పంజాబీ స్టైల్ లో ఈ ఆంథమ్ ను దల్జీత్ దోసాంజ్ పాడిన విధానం మరింత హైలెట్ గా నిలిచింది.ఇంకా అలాగే ఈ సాంగ్ వీడియో లో బుజ్జి కారును హైలెట్ చేశారు. భైరవ చేసే సాహసాలు సినిమాలో ఎలా ఉంటాయో ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు ఈ వీడియో సాంగ్ తో కూడా మరింత హైప్ పెంచారు. తమిళ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ సాంగ్ కి మ్యూజిక్ అందించారు. ఈ ఆంథమ్ ప్రేక్షకులకి ఖచ్చితంగా మంచి కనెక్షన్ ఇస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది.  'కల్కి 2898 ఎ.డి.' చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి ఇండియన్ లెజెండరి స్టార్ యాక్టర్స్ కీలక పాత్రల్లో నటించారు.ఈ సినిమా ఖచ్చితంగా 1500 కోట్లకు పైగా వసూళ్లు చేస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: