పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఎన్నో విజయాలను అందుకున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళాడు. ఇక ఈయనకు ఎంత స్టార్ డం ఉన్నా కానీ సినిమాల రెమ్యూనరేషన్ విషయంలో అంత ఖచ్చితంగా ఉండదు అని, ఒక వేళ సినిమా నిర్మాణ భారం కనుక ఎక్కువ అయినట్లు అయితే రెమ్యూనరేషన్ అనుకున్న దాని కంటే తక్కువ ఇచ్చిన, కాస్త ఆలస్యంగా ఇచ్చిన పెద్దగా పట్టించుకోడు అనే పేరు కూడా పవన్ కళ్యాణ్ కి ఉంది.

ఇకపోతే పవన్ కళ్యాణ్ మొదటిగా సాలిడ్ విజయాన్ని అందుకుంది తొలిప్రేమ మూవీతో. ఈ సినిమా విజయంతో పవన్ కళ్యాణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ మూవీ తో పవన్ కి యూత్ లో ఎక్కడ లేని క్రేజ్ వచ్చేసింది. ఇక దానితో పవన్ ఈ సినిమా సమయంలో ఎంత రెమ్యూనిరేషన్ తీసుకొని ఉంటాడు. వారు పవన్ కి రెమ్యూనరేషన్ ఎక్కువ ఇచ్చారా..? తక్కువ ఇచ్చారా..? ఇలా అనేక విషయాలు తెలుసుకోవాలి అని పవన్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా ఎప్పటి నుండో ఆశపడుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఓ ఇంటర్వ్యూ లో భాగంగా తొలిప్రేమ సినిమా సమయంలో తనకు రెమ్యూనిరేషన్ ఎలా ఇచ్చారు అనే విషయం చెప్పుకొచ్చారు.

తొలిప్రేమ సినిమా కోసం మొదట నిర్మాతలు నాకు కొంత మొత్తం ఇస్తాము అని అన్నారు. కాకపోతే మేము అనుకున్న బడ్జెట్ కంటే సినిమా బడ్జెట్ ఎక్కువ అయింది. ఆ సినిమాకు కొత్త దర్శకుడు, నాకు కూడా ఆ టైమ్ లో పెద్దగా మార్కెట్ లేదు. దానితో సినిమా విడుదల అయ్యి హిట్ అయితే రెమ్యూనరేషన్ ఇస్తాము అన్నారు. సినిమా విడుదల అయ్యి మంచి విజయం సాధించింది. దానితో సినిమా విడుదల అయిన వంద రోజులకు నాకు ఇస్తాము అన్న రెమ్యూనరేషన్ ఇచ్చారు అని పవన్ కళ్యాణ్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: