టాలెంటెడ్ దర్శకుడు శంకర్ ఏకకాలంలో ఇండియన్ 2 , గేమ్ చేంజర్ రెండు సినిమాలను పూర్తి చేస్తూ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా మొదట మొదలు పెట్టిన ఇండియన్ 2 మూవీ జూలై 12 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి పెద్ద స్థాయిలో కలెక్షన్ లు కూడా దక్కడం లేదు. ఇక ఈ మూవీ ఆల్మోస్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయిలో నష్టాలను మిగిల్చుకునే విధంగానే కనబడుతుంది.

ఇక ఇండియన్ 2 సినిమా ప్రేక్షకులను తీవ్రంగా నిరుత్సాహ పరచడంతో శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరో గా రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో అనుమానాలు మొదలు అయ్యాయి. ఈ సినిమా కూడా అలాగే ఉంటుందా అని అనుమానాలను చాలా మంది జనాలు వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే తాజాగా గేమ్ చెంజర్ మూవీ లో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్న రాజీవ్ కనకాల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

తాజా ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ ... ఇండియన్ 2 రిజల్ట్ ఎఫెక్ట్ గేమ్ చేంజర్ పై ఏ మాత్రం ఉండదు. ఇండియన్ 2 కథకి గేమ్ చేంజర్ కథకు ఏ మాత్రం సంబంధం లేదు. గేమ్ చేజర్ సినిమాలో ఒక్కో పాటను 10 , 12 కోట్లు భారీ బడ్జెట్ తో రూపొందించారు. గతంలో శంకర్ సినిమాలు ఎలాంటి స్ట్రాంగ్ కథతో , ఎంత రిచ్ మేకింగ్ తో వచ్చే అలాంటి సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుంది. అలాగే ఆ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుంది అని రాజీవ్ కనకాల తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: