కోలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న కార్తి.. ప్రధాన పాత్రలో నటించిన సర్దార్ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పి ఎస్ మిత్రా డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ ఇక ఎంతోమందికి ఒక సరికొత్త మెసేజ్ ని ఇచ్చింది. రానున్న రోజుల్లో వాటర్ మాఫియా ఎలా పెరిగిపోతోంది అనే విషయాన్ని చూపించింది. ఇక ఈ మూవీలో సాధారణ పోలీస్ గా, ఇంకోవైపు అండర్ కవర్ కాప్ గా కార్తి ద్విపాత్రాభినయం చేసిన తీరు అందరిని ఆకట్టుకుంది అని చెప్పాలి. ముసలివాడిగా ఇక పాతికేళ్ల అబ్బాయిగా కూడా మంచి నటనతో ఆకట్టుకున్నాడు కార్తి. అయితే ఈ సినిమాకు సీక్వల్ వస్తే బాగుండు అని అభిమానులు అందరూ కూడా కోరుకున్నారు.
అనుకున్నట్లుగానే ఈ మూవీకి సీక్వల్ రాబోతుంది అన్నది తెలుస్తుంది. దీంతో ఇక ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటించబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారగా.. సర్దార్ 2లో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఇటీవల మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. అయితే ఇందులో ఆశీకా రంగనాథ్, ప్రియాంక అరుణ్ మోహన్ కూడా కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా సూర్య తమ్ముడుగా కోలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన కార్తి ఎప్పుడు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను సర్ ప్రైస్ చేస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే.