మెగా ఫ్యామిలీ హీరోలు తప్పించి ఆ కుటుంబం నుండి వచ్చిన అమ్మాయిలకు సక్సస్ ఇప్పటివరకు రాలేదు. చిరంజీవి కూతురు  సుష్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా తన తండ్రి సినిమాలకు పనిచేస్తూ నిర్మాతగా రాణించాలని కొన్ని చిన్న సినిమాలు తీసినప్పటికీ ఆసినిమాలు పెద్దగా హిట్ అవ్వలేదు.



దీనితో ఆమె తన తండ్రి చిరంజీవి తో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమాను నిర్మించాలని గట్టి ప్రయత్నాలు చేసింది. అయితే ‘భోళాశంకర్’ ఫ్లాప్ అవ్వడంతో ఎలర్ట్ అయిన చిరంజీవి తన కూతురితో భారీ సినిమా చేసే విషయంలో ఆలోచనలలో పడి ఆసినిమాను వాయిదా వేయించాడు అని అంటారు. ఆమె ప్రస్తుతం వెబ్ సిరీస్ లు తీస్తూ నిర్మాతగా తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది,  



ఇక ఇదే మెగా ఫ్యామిలీ నుండి వచ్చి మొదట టీవి షోలకుహోస్ట్ గా ఆతరువాత హీరోయిన్ గా నిహారిక చేసిన ప్రయత్నాలు అన్నీ ఫెయిల్ అయ్యాయి. దీనికితోడు ఆమె వ్యక్తిగత జీవితంలో కొన్ని అనుకోని సమస్యలు ఏర్పడటంతో ఆమె మళ్ళీ కోలుకుని వెంటనే ఇండస్ట్రీలోకి వస్తుందని ఎవరు ఊహించలేదు.  లేటెస్ట్ గా విడుదలైన ‘కమిటీ కుర్రోళ్లు సినిమాకు నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా అందరు కొత్తవారితో తీసిన ఈమూవీ సక్సస్ అవుతుందని ఎవరు ఊహించలేదు.



అయితే ఈమూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకోవాడమే కాకుండా ఈ మూవీ కలక్షన్స్ బాగా ఉండటం చాలామందికి షాక్ ఇస్తోంది. ఈ వీకెండ్ లో ఈమూవీ కలక్షన్స్ బాగా ఉండటమే కాకుండా బుక్ మై షో యాప్ లో గత రెండు రోజులుగా ట్రెండింగ్ లో ఉంటూ సగటున గంటకు పదిహేను వందల నుంచి రెండు వేల దాకా ఆన్ లైన్ టికెట్లు అమ్ముడుపోతున్నాయి అని వచ్చిన వార్తలు విని ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. దీనితో రానున్న రోజులలో నీహారిక మహిళా నిర్మాతగా కొనసాగే సూచనలు స్పష్టంగా కనపడటంతో మెగా ఫ్యామిలీ ముఖ్యంగా నాగబాబు కుటుంబ సభ్యులు జోష్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: