
ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి నాగచైతన్య, శోభిత ధూళిపాళ రిలేషన్‌షిప్ పై వివాదాస్పద జోష్యం చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన వీరిద్దరి జాతకం గురించి చెప్పిన తర్వాత తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్లు మహిళా కమిషన్‌కు కంప్లైంట్ ఇచ్చారు. దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉమెన్ కమిషన్ వేణుస్వామికి సమన్లు జారీ చేసింది. ఆగస్టు 22న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. అయితే ఆయన హైకోర్టుకు వెళ్లి మహిళా కమిషన్ ఆదేశాలను నిలిపివేయాలని కోరారు. అందుకు అంగీకరించిన హైకోర్టు సమన్లపై స్టే ఇచ్చింది. ఇక్కడ లోకస్ స్టాండి అనే ఒక ముఖ్యమైన అంశాన్ని జర్నలిస్టులు తెలుసుకోలేకపోతున్నారు ఆయన చెప్పిన జాతకం తమ ఫలానా ప్రభావం చూపుతుంది అని కోర్టు ఎదట నిరూపిస్తేనే వారి లీగల్ ప్రొసీడింగ్స్ ముందుకు సాగుతాయి.
హైకోర్టు ఇచ్చిన స్టే తీర్పు కాపీలో ఏం రాసి ఉందో తెలియాల్సి ఉంది. ఫిలిం జర్నలిస్టులు హైకోర్టు ఇచ్చిన స్టే వల్ల షాక్ తిని ఉంటారు. కమిషన్ ఎదుట ఏదో ఒక రచ్చ స సృష్టించే వేణు స్వామిని మరింత ఇరకాటంలో పడేయాలని చాలామంది భావించారు. కానీ ఆయన కనీసం ఎదుట హాజర అవ్వకుండా హైకోర్టు నుంచి ఇస్తే ఆర్డర్ తెచ్చుకున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నం అశోక్ గౌడ్ ఉమెన్ కమిషన్ సమన్లకు ఎగైనెస్ట్ గా ఉన్నారు. జోక్ ఏంటంటే ఉమెన్ కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద కాంగ్రెస్ కాగా లాయర్ పొన్నం అశోక్ కూడా కాంగ్రెస్ మద్దతు దారులే ఇప్పుడు వీరిద్దరూ ఈ విషయంలో ఎగైనెస్ట్ గా నడుచుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
నాగచైతన్య, శోభిత - జ్యోతిష్కుడు మధ్య ఈ జర్నలిస్టు బంగారు ఎందుకు కలగజేసుకుంటున్నావో అర్థం కావడంలేదని చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నేను స్వామి తనకు తెలిసిన విద్య ద్వారా ఒక జాతకం చెప్పారు అది నమ్మేవారు నమ్ముతారు లేదంటే వదిలేస్తారు జర్నలిస్టు సంఘాలు మహిళల్ని పెను స్వామి కించపరిచాడు అంటూ గాయిగత్తర లేపుతున్నాయి. కానీ ఆయన జోస్యంలో ఆయన ఎవర్ని అవమానించలేదు, కించపరచలేదు.
సినీ జర్నలిస్టులు వేణు స్వామి పై పగ బట్టినట్లే చేస్తున్నారు. వేణు స్వామికి హైకోర్టు మద్దతుగా మాట్లాడటం మహిళలకు ద్రోహం చేసినట్లే అని డిబేట్లు పెట్టినా పెడతారు. ఆయనపై టీవీ ఫైవ్ మూర్తి ఇప్పుడే బాగా ఎగిరి పడుతున్నారు. ఇంకా కొందరు జర్నలిస్టులను ఉసిగొలుపుతున్నారు. హైకోర్టులో తమకు అనుగుణంగా తీర్పు రాలేదు కాబట్టి వేరు సుప్రీంకోర్టుకు వెళ్తారా? ఏం చేస్తరో చూడాలి మరి.