ఒకప్పుడు టాలీవుడ్ సినిమాలకు పెద్దగా స్కోప్ ఉండేది కాదు. తెలుగులో పెద్ద హిట్ అయిన సినిమాలు ఇతర భాషల్లో మాత్రం ఫ్లాప్ గానే మిగిలిపోయేవి. మరి ముఖ్యంగా బాలీవుడ్ లో తెలుగు సినిమాలను చిన్నచూపు చూసేవారు. కానీ ఇలాంటి పరిస్థితిని పూర్తిగా మార్చేశాడు దర్శకు ధీరుడు రాజమౌళి. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా పరిధిని పూర్తిగా చెరిపేసాడు. టాలీవుడ్ నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే చాలు కేవలం సౌత్ లోనే కాదు ఇండియాలోని ప్రతి సినీ ప్రేక్షకుడు ఆతృతగా ఎదురు చూసేలా క్యూరియాసిటీని పెంచేశాడు.


 అయితే రాజమౌళి తర్వాత ఆ రేంజ్ లో బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే సుకుమార్ అని చెప్పాలి. అల్లు అర్జున్ తో తీసిన పుష్ప సినిమా బాలీవుడ్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. దీంతో సౌత్ లోనే కాదు అక్కడ పుష్ప బ్లాక్బస్టర్ కొట్టింది. అయితే ఇలా కొన్ని సినిమాలను బాలీవుడ్ ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నా.. ఇంకొన్ని సినిమాలను మాత్రం ఓన్ చేసుకోలేకపోతున్నారు. ఇక ఇప్పుడు బ్లాక్ బస్టర్ అయిన పుష్ప సినిమాకు కొనసాగింపుగా సీక్వెల్ పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.


పుష్ప 1 డివైడ్ టాక్ తో మొద‌లై, పాన్ ఇండియా వ్యాప్తంగా ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టింది. పుష్ప 2కి డివైడ్ టాక్ ఉండ‌క‌పోవొచ్చు. ఎలివేష‌న్ల‌తో సుకుమార్ క‌డుపు నింపేయ‌డం, అల్లు అర్జున్ న‌ట విన్యాసం ముందు ఎన్ని లోటు పాట్లు ఉన్నా అవ‌న్నీ గాల్లో క‌లిసిపోతాయి. అసంతృప్తుల మ‌ధ్య పుష్ప 1 అంత పెద్ద హిట్ అయితే.. పుష్ప 2 ఏ స్థాయికి వెళ్తుందో ఇప్పుడే ఊహించ‌డం క‌ష్టం. బాలీవుడ్ వాళ్లు కూడా పుష్స‌ని ఓన్ చేసుకొంటే తెలుగు చిత్ర‌సీమ చూసిన అతి పెద్ద విజ‌యాల్లో పుష్ప 2 ఒక‌టిగా నిలిచిపోవ‌డం ఖాయం. పుష్ప మొదటి పార్ట్ తోనే బాలీవుడ్ ప్రేక్షకులను తన బుట్టలో వేసుకున్న అల్లు అర్జున్.. ఇక ఎప్పుడూ పార్ట్ 2 తో అక్కడి ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయం అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: