ఇక డైరెక్టర్ అనుదీప్ కెవి తెరకెక్కించిన జాతిరత్నాలు సినిమాతో నవీన్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమాలో తనదైన కామెడీ టైమింగ్, నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు నవీన్. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న నవీన్.. కొన్ని నెలల క్రితం యాక్సిడెంట్ కావడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్న తర్వాత తిరిగి తన ప్రాజెక్ట్స్ షురూ చేశాడు. విషయం ఏమిటంటే... ఇటీవల నందమూరి బాలకృష్ణ హోస్టింగ్ చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షోలో శ్రీలీలతో కలిసి సందడి చేసిన నవీన్ ఈ షోలో ఎన్నో విషయాలను పంచుకున్నాడు. నవీన్ ను బాలయ్య ప్రశ్నిస్తూ.. బాలీవుడ్ లో నితీష్ తివారి తెరకెక్కిస్తోన్న రామాయణంలో నువ్వు లక్ష్మణుడి పాత్ర చేస్తున్నావని వార్తలు వినిపించాయి. నిజమేనా? అని అడగ్గా.. నవీన్ ఈ రకంగా స్పందించాడు.
నవీన్ మాట్లాడుతూ... "ఇలాంటి రూమర్స్ వినడానికి చాలా అద్భుతంగా ఉంటాయి. నిజమైతే ఎంత బావుంటుందో? ఇలాంటి రూమర్స్ ఎక్కువగా వ్యాప్తి చేస్తే బావుంటుంది. అప్పుడైనా నాకు అలాంటి పాన్ ఇండియా ప్రాజెక్టులో అవకాశాలు వస్తే బాగుంటుంది!" అంటూ క్లారిటీ ఇచ్చారు నవీన్. కాబట్టి నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణంలో నవీన్ నటించడంలేదు అనే విషయం తేటతెల్లం అయిపోయింది. కాగా ఈ సినిమాలో రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి