దీంతో అందరూ ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకోవడం మొదలుపెట్టారు. అయితే తర్వాత కాలంలో అందరూ వ్యాక్సిన్లు తీసుకున్నారు అన్న విషయం తెలిసిందే. ఇలా వ్యాక్సిన్లు తీసుకున్న తర్వాత ఎంతోమంది సడన్ హార్ట్ ఎటాక్లతో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు వెలుగులోకి వచ్చాయ్. ఈ ఘటనలు ప్రతి ఒక్కరిలో మరోసారి ప్రాణ భయాన్ని కలిగించాయి. అప్పటివరకు ఎంతో సంతోషంగా ఆరోగ్యంగా కనిపించిన వారు నిమిషాల వ్యవధిలో కుప్పకూలిపోయి ప్రాణాలు వదలడం చూసి అందరూ భయాందోళనకు గురయ్యారు. అయితే ఇక ఇటీవల కాలంలో కాస్త గుండెలో నొప్పిగా అనిపించిన తెగ భయపడిపోతున్నారు.
ఇలా గుండెపోటు మరణ వార్తలు ఎక్కువ అవుతూ ఉండడంతో ఛాతి నొప్పి వచ్చినా కూడా కొందరు ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే అలా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ చెబుతున్నారు వైద్య నిపుణులు. గుండె కండరాలకు అవసరమైనంత రక్తం లభించినప్పుడు కూడా ఇలా చాతిలో నొప్పి వస్తుంది. దీనిని అంజినా పెక్టోరిస్ అని అంటారు అంటూ వైద్యులు చెప్పుకొచ్చారు. ఇది చాతిలో ఒత్తిడి వల్ల వచ్చిన నొప్పి మాత్రమే నడవడం వ్యాయామం చేయడం వల్ల శారీరక శ్రమ పెరిగి ఇలాంటిది వస్తూ ఉంటుంది. కాసేపు విశ్రాంతి తీసుకుంటే అదే తగ్గిపోతుంది అని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.