ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో సంక్రాంతి సీజన్ దాదాపు ముగిసిపోయింది .. ఇక్కడ సంక్రాంతి విజేత ఎవరు? అనేదానికి అన్ని రకాల లెక్కలు తేల్చే పనిలో ఉంది చిత్ర పరిశ్రమ .. ఇప్పుడు దాదాపు సంక్రాంతి విన్నర్‌గా నిలిచేది సంక్రాంతికి వస్తున్నాం మూవీ అనేది కన్ఫర్మ్ అయింది .. బాలయ్య డాకు మహారాజ్ సినిమాతో పోలిస్తే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకే ఎక్కువ లాభాలు వచ్చాయి కాబట్టి. ఏకధాటిక సంక్రాంతికి వస్తున్నాం సినిమాని విన్నర్ గా చెప్పవచ్చు .. సంక్రాంతి సీజన్ కి ముందుగా ప్రకటించిన సినిమాల జాబితాలో విశ్వంభ‌ర కూడా ఉంది .. ఈ సంక్రాంతికి చిరంజీవి సినిమా వస్తే తిరుగుతుందని అభిమానులు కూడా ఎంతో భావించారు. యువి క్రియేషన్స్ కూడా అందుకు తగ్గట్టుగా ప్లాన్ కూడా చేసింది.


కానీ ఎప్పుడైతే ఊహించని విధంగా గేమ్ చేంజ‌ర్‌ సంక్రాంతి వార్‌లో నిలిచిందో, అప్పుడే విశ్వంభ‌ర పక్కకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది .. గేమ్ చేంజర్ హిట్ అయితే మెగా అభిమానులు ఎంతగానో ఆనందించేవారు .. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది .. కనీసం చిరు విశ్వంభర రిలీజైన బాగుండేదని .. పండక్కు అస‌లు సిస‌లైన  సినిమా అదే అయ్యుండేదని ఇప్పుడు మెగా అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారు. మెగా అభిమానుల బాధలో నిజం లేకపోలేదు. విశ్వంభ‌ర సినిమాలో కుటుంబ ప్రేక్షకుల‌కు కావాల్సిన అన్ని అంశాలు కూడా ఉన్నాయి .. ఐదుగురు అక్కాచెల్లెళ్లకు సోదరుడిగా చిరంజీవి కనిపించబోతున్నారు .. అదేవిధంగా  సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథ కూడా ఇది .. భారీ విజువల్ ఎఫెక్ట్స్ కి ఈ సినిమాలో పెద్దపీట వేశారు.  


దేవుడు దైవత్వం అనేకాన్సెప్టుల‌కు ఇప్పుడు మంచి క్రేజ్‌ ఉంది .. చిరంజీవికి మాస్ ఇమేజ్ కూడా భారీ స్థాయిలో ఉంది ఈ కోణంలో చూసిన సంక్రాంతికి పర్ఫెక్ట్ గా ఈ సినిమా క్లిక్ అయ్యేది .. అలాగే కంప్లీట్ ఫ్యామిలీ సినిమానే టాక్ లైన్ తో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరూ చూశాం .. ఆ స్థాయిలో విశ్వంభరకి కూడా వసూళ్లు వచ్చే అవకాశం ఉండేది. ఇక విశ్వంభ‌ర‌ లాంటి భారీ సినిమాలకు పండగ సీజన్లే కరెక్ట్ .. చేతులారా సంక్రాంతి సీజన్ చేజార్చుకుంది .. ఇప్పుడు ఈ సినిమా వస్తే గిస్తే సమ్మర్లో రావాలి.. అయితే వేస‌విలో పెద్ద సినిమాల హడావుడి ఎక్కువగా కనిపిస్తుంది ..ఇదే క్ర‌మంలో విశ్వంభ‌ర‌`కు సంబంధించిన ఓటీటీ డీల్‌ ఇంకా కంప్లీట్ కాలేదు .. ఇదే క్రమంలో ప్రస్తుతం సినిమాల రిలీజ్ పూర్తిగ ఓటీటీల చేతిలోనే ఉంది .. వాళ్లు ఏ డేటు చెబితే ఆ డేట్కే సినిమాను రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది .. విశ్వంభ‌రకు ఓటీటీ డీల్‌ క్లోజ్ అయితే కానీ ఈ సినిమా రిలీజ్ కు సంబంధించిన డేట్ పై ఒక క్లారిటీ రాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: