
జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్ గా ఒక కామర్స్ యాడ్ లో నటించారు . ఈ యాడ్ అంతా బాగున్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ మాత్రం పరమ నీచంగా ఉన్నాయి అంటున్నారు జనాలు. అసలు ఆ షార్ట్ హెయిర్ కట్ ఎన్టీఆర్ కి అస్సలు సూట్ అవ్వలేదు అని ..ఎందుకు ఎన్టీఆర్ ఇలాంటి ఒక యాడ్ చేయడానికి ఒప్పుకున్నాడు అని మాట్లాడుకుంటున్నారు . కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ డబ్బు కోసం ఈ యాడ్లో నటించారు అంటుంటే మరి కొంతమంది మాత్రం కాదు కాదు కాదు ఆయన డిఫరెంట్ గా ఉండడానికి ట్రై చేశారు అంటూ మాట్లాడుకుంటున్నారు .
సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన యాడ్ వీడియో వైరల్ గా మారింది . జూనియర్ ఎన్టీఆర్ లుక్ అస్సలు బాగోలేవు అన్న కామెంట్స్ ఎక్కువగా వినపడుతున్నాయి . ఆశ్చర్యమేంటంటే సొంత నందమూరి ఫ్యాన్స్ కూడా జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ పై అసహన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని పాజిటివిటీగా ఎలా మార్చుకుంటారో జూనియర్ ఎన్టీఆర్ వేచి చూడాల్సిందే. ప్రసెంట్ పలు పాన్ ఇండియా సినిమాలతో క్షణం కూడా వేస్ట్ కాకుండా ముందుకు వెళ్తున్నాడు తారక్..!