
ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న మూవీ డ్రాగన్ .. అయితే ఈ సినిమా షూటింగ్ కి ఎన్టీఆర్ ఎప్పుడు వస్తాడు అనే విషయాన్ని రీసెంట్ గానే చిత్ర యూనిట్ ప్రకటించారు .. ఇప్పుడు అలా ప్రకటించడమే తప్పయింది .. ఫ్యాన్స్ ఇప్పుడు కొత్త డిమాండ్స్ తో చిత్ర యూనిట్ ముందుకు వస్తున్నారు .. ఈనెల 22 వ తేదీ నుంచి ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్లో కి అడుగు పెట్టబోతున్నాడు .. అయితే అప్పటి కి అటు ఇటుగా నెలరోజుల గ్యాప్లో ఎన్టీఆర్ పుట్టినరోజు రాబోతుంది .. కాబట్టి ఎన్టీఆర్ పుట్టినరోజు కు తమకు డ్రాగన్ గ్లింప్స్ కావాలనేది అభిమానుల కోరిక డిమాండ్ .. అయితే ఇది ప్రాక్టికల్ గా సాధ్యమని కూడా చెబుతున్నారు ..
ఇక గతంలో పవన్ కళ్యాణ్ తో హరీశ్ శంకర్ కేవలం వారం రోజులు మాత్రమే షూటింగ్ చేశారు . కానీ కావల్సినంత స్టాప్ ప్రేక్షకులకు అందించారు .. అలాగే ఇక రీసెంట్గా బుచ్చిబాబు కూడా రామ్ చరణ్ తో కొంచెం షూటింగ్ మాత్రమే చేసి పెద్ది గ్లింప్స్ ను విడుదల చేశారు .. ఇప్పుడు ఇదే స్ట్రాటజీని ప్రశాంత్ నీల్ కూడా ఫాలో అవ్వాలని ఎన్టీఆర్ అభిమానులు కోరుతున్నారు . ఇక మొదటి షెడ్యూల్ కు ఎన్టీఆర్ ఏకంగా 20 రోజుల కాల్ సీట్లు ఇచ్చాడు .. పైగా ఈ తొలి షెడ్యూల్లోనే యాక్షన్ సన్నివేశాలని తెరకెక్కిస్తున్నారట .. కాబట్టి తమకు కేవలం టైటిల్ కాకుండా గ్లింప్స్ కూడా కావాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు . ఇక టైటిల్ ఏంటనేది ఇప్పటికే తెలిసిపోయింది కాబట్టి గ్లింప్స్ రిలీజ్ చేయడమే కరెక్ట్ అని అంటున్నారు .. అయితే దీనిపై ప్రశాంత్ నీల్ ఏం ఆలోచిస్తారో చూడాలి ..