ఇప్పుడు ఎక్కడ చూసినా సరే అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ఏంటి..? నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరు? అనే విషయాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు జనాలు.  అయితే అసలు ఆ డైరెక్టర్ ఎవరు..? అనే విషయం బయట పడిపోయింది . నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో బన్నీ ఒక సినిమాలో నటించాలి. కానీ ఆ సినిమాని హోల్డ్ లో పెట్టి మరి అట్లీ దర్శకత్వంలో తీసుకురాబోతున్నాడు అల్లు అర్జున్ . పుష్ప లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత అలాంటి పాన్ ఇండియా హిట్ సినిమా పడితేనే బాగుంటుంది అంటూ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారట అల్లు అర్జున్ .


త్రివిక్రమ్ శ్రీనివాసరావు కూడా ఓకే చేశారట . అంతేకాదు త్రివిక్రమ్ ఇప్పుడు వెంకటేష్ తో ఒక సినిమా చేయబోతున్నాడు అనే టాక్ బయటకి వచ్చింది. అయితే అల్లు అర్జున్ సినిమాపై ఒక్కొక్క న్యూస్ లీక్ అవుతూ వైరల్ గా మారింది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ అంటూ రీసెంట్ గానే ఓ న్యూస్ బయటకు వచ్చింది. అయితే  ఇప్పుడు అల్లు అర్జున్ ఈ సినిమాలో ఒక జబ్బు పాత్రలో కనిపించబోతున్నాడు అన్న న్యూస్ బాగా వైరల్ గా మారింది . ఆల్ రెడీ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఎలాంటి క్యారెక్టర్ లో కనిపించాడో అందరికి తెలుసు.



అయితే ఇప్పుడు అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కబోయే ఈ సినిమాలో మతిమరుపు ఉన్న క్యారెక్టర్ లో కనిపించబోతున్నారట.  ఎలాంటి రోల్స్ అయినా చేయాలి అన్న ఉద్దేశంతోనే ఇలాంటి ఒక స్పెషల్ క్యారెక్టర్ ని చూస్ చేసుకున్నారట అల్లు అర్జున్. నిజంగా ఇది ఒక బిగ్ పాన్ ఇండియా స్టార్ కి వెరీ బిగ్ సాహసం అని చెప్పాలి . చూద్దాం మరి అల్లు అర్జున్ ఏ విధంగా ఈ రోల్ ని  అభిమానులకి నచ్చే విధంగా మలుస్తాడు అనేది..?? ప్రసెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: