తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో అద్భుతమైన నాని ఒకరు. నాని ఫుల్ స్పీడ్ గా సినిమాలను పూర్తి చేస్తూ ప్రేక్షకుల ముందుకు ఆ మూవీలను తీసుకువస్తూ ఉంటాడు. నాని దాదాపు సంవత్సరానికి రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. లేదంటే కనీసం సంవత్సరంలో ఒక్క సినిమా అయినా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ ఉంటాడు. ఒకానొక సందర్భంలో నాని మాట్లాడుతూ ... చాలా సంవత్సరాలుగా కంటిన్యూ గా సంవత్సరానికి ఒకటి , రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు ఎలా తీసుకు వస్తున్నాను అనే విషయాన్ని చెప్పుకొచ్చాడు.

నాని మాట్లాడుతూ ... నేను ఎప్పుడూ దర్శకుల కోసం ఎదురు చూడను. ఏదైనా ఒక దర్శకుడితో కచ్చితంగా సినిమా చేయాలి అని అతని కోసం ఎదురు చూడను. నా దగ్గరకు ఎవరైనా మంచి కథతో వస్తే అతను ఇంతకు ముందు ఎలాంటి సినిమాలు తీశాడు అనేది నేను అస్సలు పట్టించుకోను. ఆ కథ బాగుండి ... అతను దాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తాడు అనుకుంటే అతనితో సినిమా చేస్తాను. అందుకే నేను చాలా స్పీడుగా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాను అని చెప్పాడు. ఇకపోతే నాని తాజాగా హిట్ ది థర్డ్ కేస్ అనే మూవీ లో నటించాడు. ఆ తర్వాత ది ప్యారడైజ్ అనే సినిమాలో నటించబోతున్నాడు. ఇప్పటికే నాని , సుజిత్ దర్శకత్వంలో ఓ మూవీ కి కమిట్ అయ్యాడు. సుజిత్ అత్యంత స్లో గా సినిమాలను చేస్తూ ఉంటాడు. నాని అత్యంత వేగంగా సినిమాలను చేస్తూ ఉంటాడు.

సుజిత్ కెరియర్ను మొదలు పెట్టి చాలా సంవత్సరాలు అవుతున్న ఇప్పటి వరకు ఆయన దర్శకత్వంలో రూపొందిన రెండే సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. చాలా కాలం క్రితం మొదలు పెట్టిన ఓజి మూవీ షూటింగ్ కూడా స్పీడ్ గా కంప్లీట్ కావడం లేదు. ఇలా ఒకరు అత్యంత స్పీడ్ ... మరొకరు అత్యంత స్లో. వీరి కాంబినేషన్లో సినిమా పూర్తి కావడానికి ఎంత టైమ్ పడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: