టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరో లు ఉన్నారు. అందులో కొంత మంది హీరోలు ఎలాంటి సపోర్ట్ లేకుండా సినీ ఇండస్ట్రీ కి వచ్చి సక్సెస్ అయిన వారు ఎందరో ఉన్నారు. ఇక మరి కొంతమంది సినీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించిన వారు కొందరు ఉన్నారు. అందులో నటుడు మహేష్ బాబు ఒకరు. కృష్ణ వారసుడు సినిమాల్లోకి వచ్చిన మహేష్ బాబు తన సినిమాల ద్వారా ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకున్నాడు. 


ఇక మహేష్ బాబు తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ హీరోగా తన కెరీర్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబి 29 సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా 2027 సంవత్సరంలో రిలీజ్ కానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇదిలా ఉండగా.... ఈరోజు మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి పుట్టినరోజు.


ఈమె పుట్టిన రోజు సందర్భం గా మహేష్ బాబు తన తల్లితో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి గత రెండు సంవత్సరాల క్రితం సెప్టెంబర్ 2022లో మరణించారు. తన తల్లి పుట్టినరోజుని గుర్తు చేసుకుంటూ ఆమెతో దిగిన ఫోటోలను మహేష్ బాబు షేర్ చేస్తూ 'హ్యాపీ బర్త్డే అమ్మ.... మాటల్లో చెప్పలేనంతగా మిస్ అవుతున్నాను' అంటూ ఎమోషనల్ అయ్యారు.

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది. మహేష్ బాబు తల్లికి సినీ సెలబ్రిటీలు అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ ఫోటో చూసిన చాలా మంది మహేష్ బాబు తల్లికి బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు. మహేష్ బాబుకి స్ట్రాంగ్ గా ఉండమని కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: