రాజ్ తరుణ్ లావణ్య కేసులో అనేక రకాల ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. గత కొద్ది రోజుల క్రితం లావణ్య నటుడు రాజ్ తరుణ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం పెద్ద సంచలనంగా మారింది. రాజ్ తరుణ్ తనతో మాట్లాడడం లేదని తనను పట్టించుకోవడంలేదని అంతేకాకుండా వివాహం కూడా చేసుకొని అబద్ధం చెబుతున్నాడని లావణ్య ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ఈ కేసు కోర్టులో నడుస్తుండగానే కోకాపేటలోని వారి కుమారుడి ఇంటికి రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఉండడానికి వచ్చారు.


దీంతో లావణ్య వారిని ఇంట్లోకి రానివ్వలేదని గేటు బయటే వచ్చిందని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. దీనిపై లావణ్య స్పందిస్తూ... రాజ్ తరుణ్ తల్లిదండ్రులు 15 మందితో కలిసి వచ్చి తనపై దాడి చేసినట్టుగా చెప్పుకొచ్చింది.  జుట్టు పట్టుకొని గేటు వద్దకు లాక్కొచ్చారంటూ ఆరోపణలు చేసింది. అంతేకాకుండా రాజ్ తరుణ్ కి బిగ్ బాస్ బ్యూటీ అరియానాతో సీక్రెట్ గా రిలేషన్ కొనసాగిస్తున్నాడు అంటూ లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. అరియానాతో ఎఫైర్ కారణంగానే తనకు దూరమయ్యాడని లావణ్య చెబుతోంది.

అరియానా వల్లనే మేమిద్దరం విడిపోయామని లావణ్య చెబుతున్నారు. ఈ వార్తలపై రాజ్ తరుణ్ కానీ అరియానా కానీ ఇంతవరకు స్పందించలేదు. వీరి విషయంలో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తోంది. ఇదిలా ఉండగా ఈ గొడవకు ముగింపు పలకాలని రాజ్ తరుణ్ నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలోనే ఈ గొడవ నేపథ్యంలో రాజ్ తరుణ్ లావణ్యతో కలిసి డీలింగ్ సెట్ చేస్తున్నారట. తనకు 10 కోట్లు ఇవ్వాలని లావణ్య డిమాండ్ చేస్తుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే రాజ్ తరుణ్ 10 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట. 10 కోట్లు ఇచ్చి లావణ్యతో ఈ గొడవకు ముగింపు పలకాలని నిర్ణయం తీసుకున్నారట. మరి ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: