టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటన అంద చందాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో నటి అషు రెడ్డి ఒకరు. ఈ చిన్నది జూనియర్ సమంతల మంచి గుర్తింపు అందుకుంది. ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక ఈ చిన్నది సినిమాలలో మాత్రమే కాకుండా సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్ లలోను నటించింది. అంతేకాకుండా అషు రెడ్డి యాంకర్ గా, షోలలో జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది.


అషు రెడ్డి యాంకరింగ్ చేస్తూ తన చలాకితనంతో, అందచందాలతో ప్రేక్షకుల మనసులను కట్టిపడేస్తోంది. అషు రెడ్డి ఇప్పటివరకు అనేక ప్రోగ్రామ్ లలో, సినిమాలలో నటించి మంచి గుర్తింపు అందుకుంది. ఇక గత కొన్ని రోజుల క్రితం అషు రెడ్డి తీవ్ర అనారోగ్యం పాలయింది. తన బ్రెయిన్ లో పెద్ద ట్యూమర్ రావడం వల్ల ఈ చిన్నది టీవీ షోలకు పూర్తిగా దూరమైంది. తన తలకు సర్జరీ చేసి ట్యూమర్ ను తొలగించారు. దాని నుంచి కోలుకోవడానికి అషు రెడ్డికి చాలా సమయమే పట్టింది. ఐసీయూలో చాలా రోజులపాటు చికిత్స తీసుకున్న సమయంలో టాలీవుడ్ దర్శకుడు అషు రెడ్డికి సహాయం చేశాడట.

 ఇక అషు రెడ్డి ఆ వ్యాధి నుంచి వేగంగా కోలుకొని ఎప్పటిలానే మళ్లీ టీవీ షోలలో, సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయింది. ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకోగా.... అవి విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. వరుసగా ఫోటో షూట్లు చేస్తూ అవి సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అవుతాయి. ఆ ఫోటోలు చూసిన చాలా మంది నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తారు. కొంతమంది అషు రెడ్డి ఫోటోలపై పాజిటివ్ గా స్పందించగా మరికొంతమంది నెగిటివ్ గా ట్రోల్ చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: