కత్రినా కైఫ్ సినిమా ప్రేక్షకులకు ఈ అమ్మాయి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో మల్లీశ్వరి సినిమాతో చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో తన నటన, అందానికి ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఫిదా అయ్యారు. ఆ సినిమా అనంతరం ఈ చిన్నది తెలుగులో ఎలాంటి సినిమాలలో నటించలేదు. ప్రస్తుతం కత్రినా కైఫ్ బాలీవుడ్ లో అనేక సినిమాలలో నటిస్తూ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగిస్తుంది. హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకుల మనసులను దోచుకుంటుంది. ఇక హిందీలో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన సత్తాను చాటుతుంది. 

బ్యూటీ సినిమాలలో మాత్రమే కాకుండా యాడ్స్ షూటింగ్ లలో చురుగ్గా పాల్గొంటుంది. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కార్యక్రమాలలోనూ యాక్టివ్ గా ఉంటుంది. కత్రినా కైఫ్ అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ల జాబితాలో ముందు వరుసలో ఉన్నారు. ఇక సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటారు. తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ తనకు సంబంధించిన హాట్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అవుతాయి. ఇక కత్రినా కైఫ్ సినిమాలలో రాణిస్తున్న సమయంలోను బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ను వివాహం చేసుకుంది.

వివాహం తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ చిన్నది మళ్లీ ఎప్పటిలానే సినిమాలలో చురుగ్గా పాల్గొంటుంది. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ఓ పార్టీకి వెళ్లారు. అక్కడ వారి ఫ్రెండ్స్ తో కలిసి కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సమయంలోనే కత్రినా కొన్ని ఫోటోలు తీసుకున్నారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలలో కత్రినా కైఫ్ చేతి మీద వీకే అని మెహేందితో రాసుకుంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా అవి చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: