యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే . ఈ మూవీ లో తారక్ కి జోడిగా రుక్మిణి వసంత్ నటిస్తోంది . ఇప్పటి వరకు ఈ సినిమాకు మేకర్స్ టైటిల్ను ఫిక్స్ చేయలేదు. దానితో ntr NEEL అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ షూటింగ్ను మేకర్స్ ఇప్పటికే మొదలు పెట్టారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను ఇప్పటి వరకు మేకర్స్ అనౌన్స్ చేయకపోయినా ఈ మూవీ కి డ్రాగన్ అనే టైటిల్ను ఈ మూవీ బృందం వారు అనుకుంటున్నారు అని , అదే టైటిల్ ను ఆల్మోస్ట్ కన్ఫామ్ చేసి మరికొన్ని రోజుల్లో అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో ప్రశాంత్ నీల్ ఒక అదిరిపోయే ఐటమ్ సాంగ్ ను పెట్టాలి అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా డ్రాగన్ మూవీ లో ఐటమ్ సాంగ్ కోసం మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి అయినటువంటి శృతి హాసన్ ను తీసుకోవాలి అనే ఆలోచనలో ప్రశాంత్ ఉన్నట్లు , ప్రస్తుతం అందులో భాగంగా ఆమెతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు , అన్ని ఓకే అయితే డ్రాగన్ మూవీ లో శృతి హాసన్ స్పెషల్ సాంగ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ప్రశాంత్ నీల్ ఆఖరుగా సలార్ పార్ట్ 1 అనే సినిమాను రూపొందించాడు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ద్వారా శృతి హాసన్ కి ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: