
గత ఏడది సమ్మర్లో టాలీవుడ్ ఎలాంటి గడ్డు పరిస్థితి ఎదుర్కొందో తెలిసిందే. స్టార్ హీరోల సినిమా రిలీజ్ లు పక్కన పెడితే అసలు చిన్నాచితకా సినిమాలు కూడా రిలీజ్ చేయలేదు. ఇక ఐపీఎల్ ఉండనే ఉంది సమ్మర్లో చాలా థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే. గత దశాబ్ద కాలంలో ఏ సమ్మర్ కు టాలీవుడ్ లో ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. పైగా ప్లానింగ్ లోపం కూడా ఉంది .. సమ్మర్ అంటే సెలవులు సీజన్ కాబట్టి జనాలు థియేటర్లోకి వచ్చే అవకాశం ఉన్నా ఇలాంటి సినిమాలు రిలీజ్ లేకపోవడంతో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు 2025 సమ్మర్ పరిస్థితి కూడా అలాగే కనిపిస్తోంది. మే - జూన్ 2 నెలలు భానుడు భగభగలు తప్పవు. ఇప్పటికే సరైన రిలీజ్ లేక ప్రేక్షకుడికి ఎంటర్టైన్మెంట్ లేకుండా పోయింది.
ఆన్లైన్ బుకింగ్ ఓపెన్ చేస్తే చెప్పుకోదగ్గ సినిమా ఒకటి కనిపించడం లేదు. ఇక రీసెంట్ గా చూస్తే తమన్నా ఓదెల 2 .. కళ్యాణ్ రామ్ - విజయశాంతి అర్జున్ సన్నాఫ్ వైజయంతీ తప్ప ఇంకేం సినిమా లేదు. ఈ రెండు కూడా రిలీజ్ అయ్యే రోజులు అవుతున్నాయి. ఇప్పుడు అందరూ నాని హిట్ 3 సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా తప్ప పెద్ద సినిమాలు లేవు. ఒకవేళ నాని సినిమా హిట్ అయిన నెలలు తరబడి ఆడే పరిస్థితి ఉండదు. మరోపక్క ఐపిఎల్ ఉండనే ఉంది .. ఏదేమైనా టాలీవుడ్ లో పెద్ద హీరోల సినిమాల రిలీజ్ ప్లానింగ్ విషయంలో తప్పులు జరగటం వల్లే ఈ సమ్మర్ కు సరైన సినిమాలు లేక థియేటర్లు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. మంచి గోల్డెన్ ఛాన్స్‌ను టాలీవుడ్ పాడు చేసుకున్నట్లయ్యింది.
ఈ వాట్సాప్ నెంబర్‌తో సమస్య మీది.. పరిష్కారం మాది..
అవినీతి అయినా.. లంచాలైనా.. రాజకీయ నాయకులు పెట్టే ఇబ్బందులు అయినా మీ సమస్యను మా సమస్యగా భుజాన వేసుకుంటాం. నేతలు పట్టించుకోవడం లేదని.. అధికారులు దురుసుగా వ్యవహరిస్తున్నారని చింతించాల్సిన అవసరమే లేదు. రండి.. చేయి చేయి కలుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ సమస్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.. పరిష్కార మార్గాన్ని పొందండి.
నోట్ : వ్యక్తిగత, కుటుంబ సమస్యలు వద్దు