ఈ మధ్యకాలంలో మనం చూసిన్నట్లైతే సినిమాలో నటించే హీరో కన్నా హీరోయిన్ కన్నా అసలు డైరెక్టర్ కన్నా కూడా సినిమాలో నటించే విలన్ క్యారెక్టర్ హైలెట్ గా మారుతుంది . సినిమాలో ఎవరు విలన్ గా నటిస్తున్నారు అనే విషయం కూడా ఎక్కువగా ట్రెండ్ అవుతుంది . కాగా ఈ మధ్యకాలంలో వచ్చిన అన్ని సినిమాలలో హీరో క్యారెక్టర్ కన్నా విలన్ క్యారెక్టర్ హై గా పాపులారిటీ సంపాదించుకున్న సందర్భాలు మనం చూసాం.  ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఓ న్యూస్ బాగా బాగా ట్రెండ్ అవుతుంది.


మనకు తెలిసిందే అల్లు అర్జున్ - అట్లి కాంబోలో  ఓ సినిమా తెరకెక్కుతుంది . ఈ సినిమాకి సంబంధించిన లుక్ టెస్ట్ కూడా కంప్లీట్ అయింది . అయితే ఈ సినిమాలో హీరోయిన్లుగా ముగ్గురు బ్యూటీ లని చూస్ చేసుకున్నారు బన్నీ అంటూ ఓ న్యూస్ బాగా ట్రెండ్ అయ్యింది. ఈ సినిమాలో బన్నీ సరసన  జాన్వి కపూర్ - సమంత అదేవిధంగా దిశాపటాని నటించబోతున్నారంటూ ఓ న్యూస్ బయటికి వచ్చింది . అయితే ఇప్పుడు ఈ సినిమాలో విలన్ షేడ్స్ లో నటించబోయే స్టార్ పేర్లు తెరపైకి వచ్చాయి . దీంతో మళ్ళీ సోషల్ మీడియాలో బన్నీ-అట్లీ మూవీ హ్య్స్ష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి.



సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమాలో బన్నీకి విలన్ గా సన్నీ డియోల్ నటించబోతున్నారట.  అంతేకాదు డైరెక్టర్ ఎస్ జె సూర్య కూడా ఈ సినిమాలో కీలక నెగిటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నారట . అట్లీ రాసిన సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా మారబోతున్నాయట . అల్లు అర్జున్ కాదు ఏ స్టార్ హీరో కూడా తమ కెరియర్ లో టచ్ చేయలేనటువంటి ఒక స్పెషల్ కాన్సెప్ట్ ని తెరపైకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది . సోషల్ మీడియాలో ఈ న్యూస్ ఇప్పుడు బాగా వైరల్ గా మారింది. చూద్దాం మరి అట్లీ తీసుకున్న ఈ డెసీషన్ ఎల వర్క్ అవుట్ అవుతుందో...??

మరింత సమాచారం తెలుసుకోండి: