టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ కొంత కాలం క్రితం సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి , ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించగా ... అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల అయ్యి అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకొని సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసింది.

ఇకపోతే సంక్రాంతికి వస్తున్నాం లాంటి భారీ బ్లాక్ బాస్టర్ విజయం తర్వాత వెంకీ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడు అనే ఆసక్తి జనాల్లో భారీగా పెరిగిపోయింది. అలాంటి సమయంలోనే వెంకి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీ చేయబోతున్నాడు అని వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత వెంకీ , త్రివిక్రమ్ కాంబోలో మూవీ అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు అని వార్తలు వైరల్ అయ్యాయి. దానితో వెంకీ తన తదుపరి మూవీ ని ఎవరితో చేస్తాడా అనే ఆసక్తి జనాలల్లో పెరిగింది.

ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వెంకటేష్ తన తదుపరి మూవీ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనే చేయబోతున్నట్లు , ఈ మూవీ ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మించబోతున్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే వెంకటేష్ హీరో గా రూపొందిన నువ్వు నాకు నచ్చావ్ , మల్లీశ్వరి సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ రచయితగా , స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేశాడు. ఈ రెండు మూవీలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: