
తాజాగా ఈ రూమర్స్ కు సైతం శ్రీలీల క్లారిటీ ఇస్తూ ఈ పాప గురించి క్లారిటీ ఇచ్చింది. ఈ పాప తన సోదరి కూతురు అని తన ఇంటికి కొత్త కళ తీసుకువచ్చింది అంటూ తెలియజేసింది శ్రీ లీల. తనలో మరింత జోష్ నింపింది అంటూ శ్రీ లీల చేసిన పోస్ట్ మరొకసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో మూడోపాప దత్తకు తీసుకోవడంపై క్లారిటీ ఇచ్చేసింది ఈ ముద్దుగుమ్మ. శ్రీ లీల ఈ పాపతో ఆడుకుంటూ చాలా క్యూట్ గా కనిపిస్తోంది. పాపని ముద్దాడుతూ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పోస్ట్ చేసింది.
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రంలో స్పెషల్ సాంగ్ లో శ్రీలీల అదరగొట్టేసింది. నితిన్ నటించిన రాబిన్ హుడ్ సినిమాలో కూడా నటించి పర్వాలేదు అనిపించుకుంది.ఈ క్రేజ్ తోనే బాలీవుడ్ లో కూడా పలు చిత్రాల నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో కూడా రవితేజ, అఖిల్ ఇతరత్రా హీరోలతో కూడా పలు సినిమాలలో నటిస్తూ ఉన్నది. అలాగే రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రంలో కూడా శ్రీ లీల స్పెషల్ సాంగ్ లో అలరించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఇవే కాకుండా పలు చిత్రాలు శ్రీలీల చేతిలో ఉన్నట్లు సమాచారం.