
కాగా అటు జూనియర్ ఎన్టీఆర్ కి ఇటు రాంచరణ్ కి లైఫ్ లో ఒక కోరిక తీరకుండా అలానే మిగిలిపోయింది . అది కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినది కావడం గమనార్హం. ఇద్దరికీ కూడా హీరోయిన్ అనుష్క అంటే చాలా చాలా ఇష్టం కానీ అనుష్కతో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్సే వాళ్లకు లేకుండా పోయింది . గతంలో ఎన్నో సినిమాలలో వీళ్ళిద్దరి కాంబోని సెట్ చేయాలని చాలామంది డైరెక్టర్ లు అనుకున్నారు. కానీ కొన్నిసార్లు అది సెలెక్ట్ అయినట్లే అయి మిస్ అయిపోయింది . మరీ ముఖ్యంగా రామ్ చరణ్ - అనుష్క కాంబోలో మగధీర సినిమా రావాలి .
కానీ అనుష్క నే ఈ సినిమా రిజెక్ట్ చేసింది . చరణ్ నాకు తమ్ముడులా ఉంటాడు అంటూ స్క్రీన్ పై మా కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వదు అంటూ రిజెక్ట్ చేసిందట. జూనియర్ ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవాల్సింది. కానీ అది మిస్ అయ్యింది అంతకుముందు బృందావనం సినిమాలో కూడా కాజల్ ప్లేస్ లో అనుష్కని అనుకున్నారు . కానీ అది కూడా కొన్ని కారణాల చేత మిస్ అయిపోయిందట. చింతకాయల రవి సినిమాలో అనుష్కతో జస్ట్ ఒక్క నిమిషం పాటు స్టెప్స్ వేసి అలా మెరిసి ఇలా మాయమైపోతాడు జూనియర్ ఎన్టీఆర్ . అంతేతప్పిస్తే వీళ్ళ కాంబోలో సినిమానే రాలేదు ఇకపై వస్తుందన్న ఆశలు కూడా లేవు..!