
అప్పుడు రక్తం గడ్డ కట్టేలా చేసి మరి సినిమా షూటింగ్ని సైతం పూర్తి చేశామని షూట్ అవ్వగానే ఢిల్లీకి వెళ్లి మరి ట్రీట్మెంట్ చేయించుకొని ఉదయాన్నే షూటింగ్ లొకేషన్స్ కి వచ్చేసారని తెలిపారు. హీరో నాని డెడికేషన్ చూసి తాను ఆశ్చర్యపోయానని తెలిపారు డైరెక్టర్ శైలేష్ కొలను. ఇందుకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ ఒక ఫోటోను షేర్ చేస్తూ అందుకు సంబంధించిన సన్నివేశాన్ని కూడా షేర్ చేయడం జరిగింది.
సడన్గా హీరో నాని తలకు కెమెరా తగలడంతో నాని నుదుటిమీద కొంతమేరకు చీరకు పోయి రక్తం వచ్చినట్లుగా కనిపిస్తోంది.నేను చెప్పింది వీటి గురించి దెబ్బ తగిలిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ షాట్ కి రెడీ అయిపోయారు నాని.. ప్రపంచంలో ఉన్న గౌరవం అంతా కూడా హీరో నాని కి దక్కాలి అని సినిమా పట్ల తనకి ఉన్న ప్రేమ ఒక వ్యాధి లాంటిది అంటూ తెలియజేస్తూ నానితో కలిసి ప్రయాణించేలా చేసినందుకు ధన్యవాదాలు అంటూ తెలియజేశారు. హిట్ 3 సినిమా తన జీవితంలోనే ఎప్పటికీ మర్చిపోలేనంటూ ఒక పోస్ట్ ని షేర్ చేశారు.