అలనాటి నటి రోజా సెల్వమణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ చిన్నది అనేక సినిమాలలో హీరోయిన్ గా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా చేసి అభిమానులను సంపాదించుకుంది. తన నటన, అందం, అభినయంతో  ప్రేక్షకుల మనసులను దోచుకుంది. రోజా సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లోకి ప్రవేశించింది. రాజకీయాలలో తన వంతు పాత్రను పోషించి మినిస్టర్ పదవిని కైవసం చేసుకుంది. సినిమాల ద్వారా భారీగా డబ్బులను సంపాదించిన రోజా రాజకీయాల్లోనూ విపరీతంగా డబ్బులను సంపాదించింది. 

రోజా ఆస్తుల విషయానికి వస్తే రోజాకు 7 కోట్ల 38 లక్షలకు పైగా ఆస్తులు ఉన్నట్లుగా సర్వేలో వెల్లడైంది. రోజా భర్త సెల్వమణి పేరు మీద ఎలాంటి స్థిరాస్తులు లేవని తెలిసింది. రోజా కుమారుడు కృష్ణ కౌశిక్, కుమార్తె అన్షు మాలిక పేర్ల మీద 50 లక్షల 56 వేల 191 రూపాయలు డిపాజిట్లుగా ఉన్నాయని వెళ్లడైంది. రోజాకు కార్లు అంటే చాలా ఇష్టం. ఆమె పేరు మీద 7కు పైగా ఖరీదైన కార్లు ఉన్నాయి. మొత్తంగా రోజా స్థిరాస్తి రూ. 4,64,20,669 కోట్ల ఆస్తి తన పేరు మీద ఉంది. చరాస్తులు మొత్తం కలిపితే రూ. 2,74,17,761 కోట్లు ఉన్నాయి. ఇక రోజాకు ఖరీదైన భవనాలు, విల్లాలు కూడా ఉన్నాయి.

రోజాకు బంగారం, ఆభరణాలు అంటే చాలా ఇష్టం. ఆమె వద్ద ఖరీదైన నగలు, డైమండ్ జ్యువలరీ విపరీతంగా ఉన్నాయని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఖరీదైన పట్టు చీరలు, బంగారం పోతతో తయారు చేయించుకున్న ఖరీదైన చీరలు ఉన్నాయని రోజా చెప్పారు. రోజాకు పలు నగరాలలో భూములు, పంట భూములు ఉన్నట్టుగా వెళ్లడైంది. మొత్తానికి రోజా కొన్ని కోట్లకు అధిపతి అని చెప్పవచ్చు. ఇక రోజా ఇప్పటికీ సినిమాలలో నటిస్తూ భారీగా డబ్బులను సంపాదిస్తోంది. ఒక్కో సినిమాలో నటించినందుకు పది10 నుంచి 20 లక్షల రూపాయల డబ్బులను వసూలు చేస్తుందట. షోలలో జడ్జిగా వ్యవహరించినందుకు 5 లక్షల రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తుందట. ప్రస్తుతం రోజాకు సంబంధించిన ఈ వార్త హాట్ టాపిక్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: