నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అష్టా చమ్మా సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో తనకంటూ ప్రత్యేకమైన పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. తన కెరీర్ లో ఇప్పటివరకు ఎన్నో మంచి సినిమాలలో నటించి యూత్ ను ఎంతగానో ఆకట్టుకున్నారు. నాని సినిమాలకు విపరీతంగా అభిమానులు ఉన్నారు. నాని హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగాను వ్యవహరిస్తున్నారు. తన నిర్మాణ రంగంలో అనేక సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఈ హీరో నటించిన తాజా చిత్రం హిట్ 3. 

ఇందులో నాని హీరోగా నటించగా.... శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇందులో నాని అర్జున్ సర్కార్ పాత్రలో అద్భుతంగా నటించాడు. తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే నానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది. నాని తన పేరును మార్చుకోబోతున్నట్లుగా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఈ హీరో అసలు పేరు చాలామందికి తెలియకపోవచ్చు. కానీ నాని అని ప్రతి ఒక్కరూ ప్రేమగా పిలుచుకుంటారు. నాని అసలు పేరు గంట నవీన్ బాబు.

కానీ మొదటనుంచి నాని అనే పేరుతోనే ఈ హీరో పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఈ మధ్యకాలంలో నానికి స్టార్ హీరో స్టేటస్ వస్తుండడంతో నాని అని పేరు స్క్రీన్ పైన ఉంటే పేరులో పెద్దగా వెయిట్ ఉండదు అని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే నాని మంచి స్క్రీన్ నేమ్ కోసం చూస్తున్నట్లుగా సినీ వర్గాల్లో జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ నానీకి సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనంగా మారుతుంది. ఈ విషయం పైన హీరో నాని ఏదో ఒక క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం బయటికి రాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: