తమిళ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌గా తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు రజనీకాంత్. ఆరుప‌దుల వయసులోనూ.. ఇప్పటికి తన మ్యానరిజంతో ఆకట్టుకుంటున్న ఆయన.. యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా సౌత్ ఇండియాలో స్టార్ హీరోలుగా వెలుగందున వాళ్ళలో రజనీకాంత్ పేరు మొదటి వరుసలో వినిపిస్తోంది. ఇక ఆయనకు తమిళ్‌తో పాటు.. తెలుగులోను భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన నుంచి ఒక్క సినిమా వస్తుందంటే తెలుగు ఆడియన్స్‌లోను మంచి హైప్‌ నెలకొంది. ఎంతో మంది ఆసక్తిగా సినిమా చూసేందుకు ఎదురు చూస్తూ ఉంటారు.
 

కాకపోతే.. రజిని జైలర్ 2 సినిమా షూట్‌లో బిజీగా గ‌డుపుతున్నాడు. ఇప్పటికే లోకేష్ కనగ‌రాజ్‌ డైరెక్షన్‌లో కూలి సినిమా షూట్ పూర్తి చేసిన ఆయన.. నెల్సన్ డైరెక్షన్‌లో జైలర్ 2పై ఫోకస్ చేసి షూట్ లో బిజీగా గ‌డుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన జైలర్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచి ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న జైలర్‌ కూడా.. అదే రేంజ్‌లో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అంటూ అభిమానులు స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు. కాగా జైలర్‌లో శివరాజ్ కుమార్, మోహన్ లాల్ గెస్ట్ అపీరియన్స్ తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

 

వీళ్ళిద్దరి క్యామియో రోల్‌ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఈ క్రమంలోనే జైలర్ 2 లోను ఇలాంటి క్యామియో పాత్ర ఒకటి ఉండబోతుందని.. అందులో బాలయ్య నటించబోతున్నాడు అంటూ న్యూస్ నెటింట‌ వైరల్ అవుతుంది. ఇక బాలయ్య రోల్‌ సినిమాలో చాలా పవర్ ఫుల్ గా ఉండనుందట. ఇక సినిమా మొత్తంలో బాలయ్య పాత్రనడివి 15 నిమిషాలు ఉండనుందని.. ఈ సినిమాలో 15 నిమిషాల నటన కోసమేకంగా రూ.15 కోట్ల రెమ్యున‌రేష‌న్‌ను బాలయ్య తీసుకుంటున్నాడంటూ టాక్‌ వైరల్‌గా మారుతుంది. ఇక ఈ సినిమాలో ఆయన ఊరమాస్ ఎలివేషన్స్ గూస్ బంప్స్‌ తెప్పించడం ఖాయమని.. పవర్ఫుల్ బాలయ్యను, రజిని పీక్ రేంజ్ ఆటిట్యూడ్ తో ఒకేసారి స్క్రీన్ పై చూస్తే ఆడియన్స్ కు ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే తమిళ్‌లో సినిమా విధ్వంసం సృష్టించడం ఖాయమని.. బాలయ్య హైప్‌తో టాలీవుడ్ లోనూ ఇదే రేంజ్ సక్సెస్ అందుకుంటుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: