టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటులలో రామ్ పోతినేని ఒకరు. రామ్ ఇప్పటి వరకు చాలా సినిమాలలో హీరో గా నటించగా అందులో ఎన్నో మూవీ లతో మంచి విజయాలను అందుకున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం రామ్ నటించిన సినిమాలు వరుసగా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొడుతూ వస్తున్నాయి. కొంత కాలం క్రితం రామ్ "ది వారియర్" అనే పవర్ ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఈ మూవీ తర్వాత ఈయన స్కంద అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

సినిమా కూడా రామ్ కి నిరాశనే మిగిల్చింది. కొంత కాలం క్రితం రామ్ "డబల్ ఇస్మార్ట్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ప్రస్తుతం రామ్ , మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి మేకర్స్ టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ సినిమాను రాపో 22 అనే వర్కింగ్ టైటిల్ తో మేకర్స్ పూర్తి చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు.

తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లీమ్స్ ను మే 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు. మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఇక ఈ మూవీ టైటిల్ గ్లీమ్స్ గనుక ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నట్లయితే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: