టాలీవుడ్ ఇండస్ట్రీలో వైవిధ్యమైన సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చే హీరోగా సుధీర్ బాబుకు పేరుంది. ఎలాంటి పాత్రలో అయినా సుధీర్ బాబు అలవోకగా నటిస్తారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నవ దళపతి సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ విడుదలైంది. సుధీర్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ ప్రీ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
 
ఈ మధ్య కాలంలో రక్తపాతానికి ప్రాధాన్యత ఉన్న సినిమాలు సక్సెస్ సాధిస్తుండగా "ఏ బ్రోకెన్ సౌల్ ఆన్ ఏ బ్రూటల్ సెలబ్రేషన్" అనే ట్యాగ్ లైన్ తో విడుదలైన ఈ లుక్ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఆర్.ఎస్ నాయుడు డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుండగా ఈ సినిమా పోస్టర్ చూసిన ప్రేక్షకులు ఈ మూవీతో సుధీర్ బాబు పాన్ ఇండియా స్థాయి హిట్ అందుకుంటారని భావిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో 51వ సినిమాగా ఈ మూవీ తెరకెక్కుతుండగా విశ్వ ప్రసాద్ తో పాటు కృతి ప్రసాద్ ఈ సినిమాకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు.
 
సర్వైవల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కనుండగా కండలు తిరిగిన దేహంతో ఆయుధం పట్టుకుని సుధీర్ బాబు తన లుక్ తో అదరహో అనిపించారు. సుధీర్ బాబు ఈ సినిమా కోసం లుక్ మార్చుకోవడానికి ఎంతో కష్టపడ్డారని పోస్టర్ చూస్తుంటే అర్థమవుతోంది. సుధీర్ బాబు బీస్ట్ మోడ్ లుక్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులకు సైతం నచ్చింది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు.
 
ప్రస్తుతం క్రేజీ పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ రాబోయే రోజుల్లో భారీ హిట్లను ఖాతాలో వేసుకోనుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటున్న సుధీర్ బాబు కెరీర్ బిగ్గెస్ట్ హిట్లను సొంతం చేసుకోవడంతో ఇలాంటి మరెన్నో పుట్టినరోజులను జరుపుకోవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: