
అయితే హీరో హర్షవర్ధన్ రాణే ` సనమ్ తేరి కసమ్ 2 ` సినిమా ఆఫర్‌ను తాజాగా తిరస్కరించారు. హీరోయిన్ గా మావ్రా హుస్సేన్ ఉంటే తాను నటించనంటూ నిర్మొహమాటంగా చెప్పేశారు హర్షవర్ధన్. ఇందుకు కారణం లేకపోలేదు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌పై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ ప్రతీకారం తీర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆపరేషన్ సింధూర్ పాక్ నటి అయిన మావ్రా హుస్సేన్ నోరు జారారు. ` భారత్ దాడిని ఖండిస్తున్నాను. నిర్దోషులు ప్రాణాలు కోల్పోయారు. అల్లా మీకు జ్ఞానం ప్రసాదించాలి ` అంటూ ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలను తప్పుబట్టిన హర్షవర్ధన్ రాణే.. మావ్రా హుస్సేన్‌కు బిగ్ షాక్ ఇచ్చారు. ` నా దేశం గురించి చేసిన ప్రత్యక్ష వ్యాఖ్యలను చదివిన తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. గతంలో యాక్ట్ చేసిన వారే ఇప్పుడు కూడా యాక్ట్ చేసే అవకాశం ఉంటే.. సనమ్ తేరి కసం పార్ట్ 2లో నేను నటించను` అంటూ హర్షవర్ధన్ ఇన్‌స్టా స్టోరీలో పేర్కొన్నాడు. అలాగే మరొక పోస్ట్ లో ` ఏ దేశానికి చెందిన నటులైన నేను గౌరవిస్తాను.. కానీ నా దేశాన్ని చులకన చేస్తే సహించలేను. నీ దేశానికి మద్దతుగా నిలవడం మంచిదే.. కానీ పక్క దేశంపై విషం జల్లడం సరికాదు` అంటూ మావ్రా హుస్సేన్ కు హర్షవర్ధన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇక హర్షవర్ధన్ నిర్ణయం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాక్ హీరోయిన్ గా సరైన బుద్ధి చెప్పావంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు