సమంత నిర్మించిన తాజా మూవీ శుభం విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.అయితే సమంత అనుకున్నంత అయితే సినిమాకి రెస్పాన్స్ రాలేదనే టాక్ వినిపిస్తోంది.ఈ నేపథ్యంలోనే శుభం సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ లో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుంది సమంత.  ఇందులో భాగంగా తాజాగా ఆ పాటలో నేను చాలా హాట్ గా ఉన్నాను అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేసింది సమంత. మరి ఇంతకీ సమంత ఏ పాట గురించి మాట్లాడింది అనేది ఇప్పుడు చూద్దాం. సమంత విడాకులు అయ్యాక ఆమె తీసుకున్న ఒక పెద్ద డెసిషన్ పుష్ప సినిమాలో ఊ అంటావా మావా ఉ ఊ అంటావా అనే ఐటెం సాంగ్ కి డ్యాన్స్ చేయడమే.అయితే ఈ పాట ఒప్పుకునే సమయంలో చాలామంది ఆమెను వద్దని హెచ్చరించారట.కానీ ఆ పాటని సమంత చాలెంజింగ్ గా తీసుకొని మరీ ఆ పాట చేసిందట. 

మొదట తన తల్లిదండ్రులు కూడా ఈ పాట చేయవద్దు అని హెచ్చరించార. కానీ నటిగా అన్ని చేయాలి అని ఒకే ఒక్క కాన్సెప్ట్ తో సమంత ఈ పాట చేయడానికి ఒప్పుకుందట. అయితే తాజాగా ఈ ఊ అంటావా అనే పాట గురించి సమంత స్పందిస్తూ ఈ విధంగా కామెంట్లు చేసింది. నేను నా లైఫ్ లో ఎప్పుడూ కూడా హాట్ గా, అందంగా ఉంటానని అనుకోలేదు. చాలామంది నేను వేరే వాళ్ల కోసం స్టేట్మెంట్ ఇస్తానని అనుకుంటారు. కానీ నేను ఏదైనా సరే చాలెంజింగ్ గా తీసుకుంటాను.. నేను హాట్ గా నటించగలనో లేదో ఊ అంటావా మావా ఉ ఊ అంటావా మావా అనే పాట ద్వారానే తెలుసుకున్నాను. అయితే ఈ పాట కంటే ముందు ఎప్పుడూ కూడా అలాంటి పాటలో డ్యాన్స్ చేయలేదు. కాబట్టి దాన్ని ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని చేశాను. అయితే ఈ పాట కోసం నన్ను అప్రోచ్ అయినప్పుడు చాలా షాక్ అయ్యా.

ఎందుకంటే ఇలాంటి హాట్, స్పెషల్ సాంగ్ కోసం నన్ను ఎవరు తీసుకుంటారు అనుకున్నాను. ఎందుకంటే నేను ఇప్పటివరకు  చేసిన పాత్రలన్నీ చాలా క్యూట్ గా బబ్లీగానే ఉంటాయి.కానీ ఫస్ట్ టైం ఇలాంటి అవకాశం రావడంతో షాక్ అయిపోయాను.అలాగే ఈ పాటలో కావాల్సింది డాన్స్ మాత్రమే కాదు. నా వైఖరి కూడా చూస్తారు.. అందుకే ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను.మొదట మా వాళ్లందరూ ఇది వద్దన్నారు. కానీ పాటలోనే లిరిక్స్ నచ్చి ఓకే చెప్పాను. ఇందులో నేను చాలా హాట్ గా కనిపించాను. అయితే ఫస్ట్ రోజు 500 మంది డాన్సర్ల ముందు డాన్స్ చేయాలంటే భయపడి వణికి పోయాను. ఆ తర్వాత మామూలే అనిపించింది అంటూ ఊ అంటావా మావా అనే పాట లో చేసినప్పుడు తలెత్తిన అనుభవాలను పంచుకుంది సమంత.

మరింత సమాచారం తెలుసుకోండి: