టాలీవుడ్ యువ నటుడు శ్రీ విష్ణు ఈ మ ధ్యకాలంలో అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. కొంత కాలం క్రితం సామజవరగమన అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న శ్రీ విష్ణు ఆ తర్వాత ఓం భీమ్ బుష్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి ఈ మూవీ తో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అలా రెండు విజయాల తర్వాత శ్రీ విష్ణు "స్వాగ్" అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

స్వాగ్ లాంటి అపజయం తర్వాత శ్రీ విష్ణు "సింగిల్" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులు అయినటువంటి కేతికా శర్మ , ఇవానా హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా మే 9 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ వచ్చింది. దానితో ఈ సినిమాకు మొదటి రోజు మంచి ఓపెనింగ్లు లభించడం మాత్రమే కాకుండా ఆ తర్వాత కూడా మంచి కలెక్షన్స్ దక్కుతున్నాయి.

ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన మూడు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ మూడు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల్లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకొని హిట్ స్టేటస్ను అందుకోవడంతో ఈ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసి భారీ లాభాలను అందుకుంటుంది అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sv