పూర్వకాలం నుండి ఉన్న లండన్ మ్యూజియం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ లండన్ మ్యూజియంని గతంలో మ్యూజియం ఆఫ్ లండన్ అని పిలిచేవారు. లండన్ మ్యూజియం పూర్వకాలం నుండి ఆధునిక కాలం వరకు ఉన్న చరిత్రను వివరిస్తుంది. అయితే ఈ మ్యూజియంలో ముఖ్యంగా సామాజిక చరిత్రకు సంబంధించిన వాటిని మనం చూడవచ్చు. లండన్ మ్యూజియంలో చోటు సంపాదించుకోవడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది అంతా గొప్ప చరిత్ర కలిగి ఉన్న లండన్ మ్యూజియంలో మన తెలుగు స్టార్స్ మైనపు విగ్రహాలు ఉండడం చాలా గొప్ప విషయం.

ఇదిలా ఉండగా.. ఇటీవలే ఈ అరుదైన గౌరవం మరో తెలుగు స్టార్ట్ హీరోకి దక్కిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి కుమారుడు, స్టార్ హీరో రామ్ చరణ్ ఈ గౌరవాన్ని సొంతం చేసుకున్నాడు. లండన్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో నటుడు రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఈ నెల 9వ తేదీన లంఛ్ చేయనున్నట్లు చేశారు. ఈ సందర్భంగా ఆ అరుదైన గౌరవాన్ని చూసేందుకు మెగా ఫ్యామిలీ మొత్తం లండన్ కి వెళ్లారు. చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, వారి కూతురు క్లీన్ కారాతో పాటుగా రామ్ చరణ్ పెంపుడు కుక్క రైమ్ కూడా లండన్ కి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం కూడా జరిగింది.

అయితే తాజాగా ఈ కార్యక్రమం నేపథ్యంలో టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ కూతురు క్లీంకార సందడి చేసింది. విగ్రహం పక్కన కూర్చోవడానికి రామ్ చరణ్ స్టేజ్ పైకి వెళ్లారు. ఆ సందర్భంలో ఆయన కూతురు క్లీంకార కూడా ఆయన వెనకే బుడిబుడి అడుగులు వేస్తూ వెళ్లింది. తల్లి ఉపాసన ఎంత ఆపిన ఆగకుండా తండ్రి వెనకే క్లీంకార వెళ్లిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ వావ్ సూపర్ ఎంత ముద్దుగా ఉందో అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: