శ్రీ విష్ణు సింగిల్ సినిమాతో ప్రేక్షకులను అలరించి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాలో గ్లామరస్ బ్యూటీ  కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో హీరోయిన్ గా కేతిక శర్మతో పాటుగా నటి ఇవానా కూడా నటించింది. ఈ సినిమాను డైరెక్టర్ కార్తీక్ రాజు తెరకెక్కించారు. ఈ మూవీలో వెన్నల కిషోర్ ముఖ్యపాత్రలో కనిపించారు. మే 9న విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ మూవీ మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అని రివ్యూలు కూడా వచ్చాయి. అలాగే ఈ సినిమా కేతిక శర్మ సినీ జీవితంలో ఫస్ట్ హిట్ గా నిలిచింది.

మూవీ ప్రస్తుతం టాప్ వన్ సినిమాగా థియేటర్ లలో కొనసాగుతుంది. సింగిల్ మూవీ భారీ కలక్షన్స్ లతో దూసుకెళ్తుంది. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.  శ్రీ విష్ణు సింగిల్ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. సింగల్ సినిమా ఇప్పటికే రూ. 16.3 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీ కేవలం ఒక్క రోజులోనే 66 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. దీంతో మొత్తం టిక్కెట్ల సంఖ్య 2 లక్షలను దాటింది. ఈ మూవీ ముందు ముందు భారీ కలక్షన్స్ ని సొంతం చేసుకోనుంది.

సింగిల్ మూవీ అల్లు అరవింద్ సమర్పణలో తెరపైకి వచ్చింది. ఈ మూవీకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించగా.. భాను ప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మాతలుగా వ్యవహించారు. ఇకపోతే శ్రీవిష్ణు ఇప్పటికే వరుస సినిమాలను చేస్తూ మంచి హిట్ లను అందుకుంటున్నాడు. ఇక ఈ సినిమాతో శ్రీవిష్ణు ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. శ్రీ విష్ణు సినిమా సెలెక్షన్ అంటే మామూలుగా ఉండదు అంటూ ప్రేక్షకులలో టాక్ వినిపిస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: