
చాలామంది హీరోయిన్లతో పోల్చి చూస్తే నయనతార పారితోషికం ఎక్కువ కాగా గతంతో పోలిస్తే ఈ హీరోయిన్ క్రేజ్ కూడా తగ్గుతోంది. పాన్ ఇండియా స్థాయిలో నయనతార లేడీ ఓరియెంటెడ్ సినిమాలు సక్సెస్ సాధిస్తున్నా సోలో హీరోయిన్ గా నటిస్తున్న సినిమాలు ప్రేక్షకుల మెప్పు పొందడం లేదనే చెప్పాలి. ఈ ఫ్లాప్ కాంబోను రిపీట్ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
ఎంతోమంది టాలెంటెడ్ హీరోయిన్లు ఉండగా వాళ్లను రిపీట్ చేసి ఉండేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చిరంజీవికి కూడా ఐశ్వర్య రాజేష్ లేదా మీనాక్షి చౌదరికి ఛాన్స్ ఇచ్చి ఉంటే ఈ జోడీ రిఫ్రెషింగ్ గా ఉండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే భారీ బడ్జెట్ మూవీ కావడం వల్లే అనిల్ రావిపూడి నయనతారను ఎంపిక చేశారని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.
వరుసగా 9 విజయాలను సాధించిన అనిల్ రావిపూడి చిరంజీవి సినిమాతో పదో విజయాన్ని అందుకుంటారేమో చూడాల్సి ఉంది. రీఎంట్రీలో చిరంజీవి కెరీర్ ఆశాజనకంగా లేదు. అందువల్ల చిరంజీవి వరుస విజయాలను సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఈ మెగా హీరో కళ్లు చెదిరే రికార్డులను సొంతం చేసుకోవాలని అభిమానులు మనస్పూర్తిగా ఫీలవుతున్నారు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. నయనతార కాకుండా ఈ సినిమాలో మరో హీరోయిన్ నటిస్తారేమో చూడాల్సి ఉంది. నయనతార సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.