తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. ఈయన ఇప్పటివరకు అనేక సినిమాలకు దర్శకత్వం వహించాడు. అలాగే దర్శకత్వం వహించిన ప్రతి మూవీతో కూడా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని ఒక్క అపజయం లేని దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలో కెరియర్ను కొనసాగిస్తున్నాడు. అనిల్ సినిమాలను తెరకెక్కించడంలో ఎంత చురుగ్గా ఉంటాడో సినిమాను ప్రమోట్ చేసే విషయంలో కూడా అంతే చురుగ్గా ఉంటాడు అనిల్ రావిపూడి తను దర్శకత్వం వహించిన సినిమాల ప్రమోషన్లను అద్భుతమైన రీతిలో చేస్తూ ఉంటాడు. దానితో సినిమా విడుదలకు ముందే ఆ మూవీలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇకపోతే అనిల్ రావిపూడి తన నెక్స్ట్ మూవీ ని మెగాస్టార్ చిరంజీవి తో చేయబోతున్నాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అలాగే ఈ సినిమాకు సంబంధించిన ఓపెనింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఈ మూవీ కి టైటిల్ను ఫిక్స్ చేయని నేపథ్యంలో ఈ మూవీని మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ ని మొదలు పెట్టారు. ఇకపోతే ఇప్పటికే అనిల్ రావిపూడి మెగా 157 కి సంబంధించిన ప్రమోషన్లను మొదలు పెట్టాడు.

కొంత కాలం క్రితం చిరంజీవి మరియు ఈ సినిమాకు సంబంధించిన టెక్నీషియన్స్ తో ఓ వీడియోని చేసి విడుదల చేసిన అనిల్ రావిపూడి తాజాగా మరో వీడియోతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ మూవీలో నయనతార హీరోయిన్గా నటిస్తోంది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ వీడియోని విడుదల చేసింది. ఇది కూడా ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంటుంది. దాదాపుగా నయనతార ఏ సినిమాకు ప్రమోషన్ లోను చెయ్యదు. కానీ ఈ సినిమా స్టార్ట్ కాకముందే ఈ మూవీ ప్రమోషన్ వీడియోను విడుదల చేసింది. దానితో అనిల్ రావిపూడి అంటే ప్రమోషన్స్. ఆయన ఎవరితోనైనా ప్రమోషన్లు చేయించగలరు. ఆయన గ్రేట్ అంటూ అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: