పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితం హరిహర వీరమల్లు , ఓజి , ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాలకు కమిట్ అయ్యాడు. ఈ సినిమాలో షూటింగ్లో పూర్తి చేసే లోపే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడడంతో పవన్ పూర్తిగా సినిమా షూటింగ్లకు బ్రేక్ ఇచ్చి రాజకీయాలపై దృష్టి పెట్టాడు. కొన్ని రోజుల క్రితం జరిగిన ఎలక్షన్లలో జనసేన పార్టీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం పవన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉండడంతో ఎలక్షన్లు పూర్తి అయ్యి చాలా కాలమే అవుతున్నా పవన్ ఇప్పటికీ కూడా చాలా బిజీగా ఉన్నాడు.

దానితో ఎలక్షన్లు పూర్తి అయ్యే చాలా కాలం వరకు పవన్ సినిమా షూటింగ్లకు సమయాన్ని కేటాయించలేదు. ప్రస్తుతం పవన్ వరుస పెట్టి తాను కమిట్ అయిన మూడు సినిమాలకు డేట్లు ఇచ్చాడు. అందులో భాగంగా ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ను కంప్లీట్ చేశాడు. మరికొన్ని రోజుల్లోనే ఓజి , ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్లను కూడా కంప్లీట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. హరిహర వీరమల్లు సినిమాను ఈ సంవత్సరం జూన్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ కు సినిమా ఈవెంట్లను పెద్ద స్థాయిలో చేయడం ఇష్టం ఉండదు. దానితో ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ పనులతో పవన్ చాలా బిజీగా ఉన్నాడు. దానితో హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన ఏవైనా ఈవెంట్లకు పవన్ కళ్యాణ్ అటెండ్ అవుతాడా లేదా అనే ఆసక్తి పవన్ అభిమానుల్లో పెరిగింది.

దానితో పవన్ సినిమా షూటింగ్లను పూర్తి చేస్తున్న బయట సినిమా ఈవెంట్లకు వస్తే బాగుండు అనే కోరిక పవన్ అభిమానుల్లో భారీ ఎత్తున ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కు సినిమా ఫంక్షన్లు పెద్ద ఎత్తున చేయడం పెద్దగా ఇష్టం ఉండదు. దానితో పవన్ తదుపరి మూడు మూవీలకు సంబంధించిన ఈవెంట్లను ఏమైనా ప్లాన్ చేస్తారా ..? ప్లాన్ చేస్తే వాటికి పవన్ వస్తాడా అనే టెన్షన్ పవన్ అభిమానుల్లో మొదలైనట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: