తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఘట్టమనేని ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సూపర్ స్టార్ కృష్ణ తర్వాత ఆయన తనయుడిగా మహేష్ బాబు ఘట్టమనేని లెగసిని ముందుకు నడిపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మహేష్‌ బాబు అన్న, దివంగ‌త నటుడు రమేష్ బాబు తనయుడు జయకృష్ణ లాంచింగ్ కు రంగం సిద్ధం అవుతుంది.


ఇప్పటికే యాక్టింగ్ సహా పలు అంశాలపై జయకృష్ణ శిక్షణ తీసుకున్నాడు. జయకృష్ణ డెబ్యూ కోసం `ఆర్ఎక్స్ 100`, `మంగళవారం` వంటి బోల్డ్ చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైన డైరెక్టర్ అజయ్ భూపతి లైన్ లోకి వచ్చినట్టు తెలుస్తోంది. యాక్షన్, ఎమోషనల్ డ్రామాతో కూడిన యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌తో జయకృష్ణను హీరోగా లాంచ్ చేసి మరో హిట్ కొట్టేందుకు అజయ్ భూపతి రెడీ అవుతున్నాడు.



టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌ వైజయంతీ మూవీస్, ఆనంది ఆర్ట్స్ సంయుక్తంగా ఘట్టమనేని జయకృష్ణ-అజ‌య్ భూప‌తి ఫిల్మ్ ను నిర్మించ‌నున్నాయ‌ని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా ప్రచారం జరుగుతుంది. తాజాగా జయకృష్ణ ఈ సినిమాకు సంబంధించిన ఫోటోషూట్ లో కూడా పాల్గొన్నాడ‌ని తెలుస్తోంది. ఇక‌ అన్న కుమారుడు కావడంతో మహేష్ బాబు సైతం జయకృష్ణ డెబ్యూ విషయంలో స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇస్తూ చాలా కేర్ తీసుకుంటున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే ఈ చిత్ర ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌బోతుంది. ఈ నేప‌థ్యంలోనే జయకృష్ణ తొలి చిత్రం విజ‌య‌వంతం కావాల‌ని ఘ‌ట్ట‌మ‌నేని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: