తెలుగు లో తొలి సినిమాతోనే హిట్‌ అందుకుంది యంగ్ బ్యూటీ ఇవానా. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీవిష్ణు హీరోగా కార్తీక్ రాజు దర్శకత్వంలో వచ్చిన రీసెంట్ సూపర్ హిట్ `సింగిల్`. ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ లో కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. మే 9న రిలీజ్ అయిన సింగిల్ మూవీ ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని పంచుతూ మంచి విషయాన్ని నమోదు చేసింది. సింగిల్ హిట్ కావ‌డంతో ఇవానాకు తెలుగులో మరిన్ని ఆఫర్లు క్యూ కడుతున్నాయి.


ఇదిలా ఉండగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇవానా.. హైట్ విషయంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను అందరితోనూ పంచుకుంది. చిన్నతనం నుంచి చాలా మంది హైట్ విషయంలో ఇవానాను ఏడిపించేవారట. హైట్ కొంచెం తక్కువగా ఉండడంతో క్లాస్మేట్స్ పొట్టి అని పిలుస్తూ హేళన చేసేవారట. దాంతో స్టడీస్ పై సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేకపోయానని ఇవానా చెప్పుకొచ్చింది. అలాగే ఇండస్ట్రీకి వచ్చాక కూడా హైట్ విషయంలో ఇవానా ఎన్నో అవమానాలు, తిరస్కరణలు ఎదుర్కొందట. `నీకు సినిమాలు అవసరమా పొట్టి దాన` అంటూ ఘోరంగా అవమానించిన వారు ఉన్నారట.


అయితే హైట్ కాదు టాలెంట్ ముఖ్యమని ఇవానా నిరూపించింది. 2012లో మలయాళం లో `మాస్టర్స్` అనే మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇవానా తన ఫిల్మ్ జ‌ర్నీని ప్రారంభించింది. అప్ప‌టికి ఆమె వ‌య‌సు 12 ఏళ్లే. ఇంటర్‌లో ఉండగా `నాచియార్‌`తో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన ఇవానా.. 2022లో `లవ్ టుడే` మూవీతో మెయిన్ హీరోయిన్‌గా మారింది. ఈ సినిమా ఎంతటి విషయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లవ్ టుడే తో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న ఇవానా.. ఆ త‌ర్వాత `ఎల్‌జీఎమ్‌`, `మతిమారన్‌`, `కల్వన్‌` లాంటి చిత్రాల్లో న‌టించింది. ఇటీవల వచ్చిన `డ్రాగన్‌`లో క్యామియోలో కనిపించింది. తాజాగా సింగిల్ చిత్రంతో మ‌రో హిట్ ను కొట్టి అవ‌కాశాలు అందిపుచ్చుకుంటోంది. అన్న‌ట్లు ఇవానా అస‌లు పేరు `అలీనా షాజీ`. ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చాకే ఇవానాగా పేరు మార్చుకుంది. టాలీవుడ్ లో  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఈ బ్యూటీ వీరాభిమాని అట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: