స్టార్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ హీరో తన కెరీర్ లో ఎన్నో సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ హీరోగా కొనసాగుతున్నారు. ఈ హీరో కోలీవుడ్ లో మాత్రమే కాకుండా టాలీవుడ్ లోనూ అనేక సినిమాలు చేసి సక్సెస్ఫుల్ స్టార్ హీరోగా సాగుతున్నారు. హీరో విశాల్ వయసు పెరిగినప్పటికీ ఇన్ని రోజులుగా వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉన్నారు. తాజాగా తన పెళ్లి విషయం గురించి విశాల్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ హీరోయిన్ సాయి ధన్సికతో విశాల్ తన ప్రేమ విషయాన్ని అనౌన్స్ చేశాడు. చాలా కాలం నుంచి సాయి ధన్సికతో విశాల్ ప్రేమలో ఉన్నట్టుగా చెప్పారు. 


ఫైనల్ గా కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకుంటున్నారని అన్నారు. ఈ విషయం తన అభిమానులతో షేర్ చేసుకున్నారు. దీంతో విశాల్ గతంలో కొంతమంది హీరోయిన్లతో లవ్ స్టోరీలు, ఎఫైర్లు నడిపించారని అనేక రకాల వార్తలు తెరపైకి వస్తున్నాయి. హీరో విశాల్ ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ తో చాలా కాలం పాటు ప్రేమలో ఉన్నారు. అంతేకాకుండా వీరిద్దరూ వివాహం చేసుకుంటారని ప్రతి ఒక్కరూ అనుకున్నారు. ఫైనల్ గా వరలక్ష్మి మరో అబ్బాయిని వివాహం చేసుకుంది. విశాల్ నటి లక్ష్మీ మీనన్ తో కొన్ని రోజులు ప్రేమలో ఉన్నట్టుగా అనేక రకాల వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయంపై విశాల్ ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు.

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తో విశాల్ ప్రేమలో ఉన్నాడని కొన్ని రోజులపాటు అనేక రకాల వార్తలు వచ్చాయి. దానికి గల కారణం వీరిద్దరూ చాలా సందర్భాలలో బయట కెమెరా కంటపడ్డారు. అంతే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అనేక రకాల వార్తలు వచ్చాయి. కానీ కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడిని ప్రేమ వివాహం చేసుకుంది. హీరోయిన్ అనీషా రెడ్డితో విశాల్ ప్రేమలో ఉన్నట్టుగా సినీ సర్కిల్ లో జోరుగా వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో మీరు ప్రేమలో ఉన్నారని అంతా అనుకున్నారు.


 నటి అభినయతో కూడా విశాల్ ప్రేమలో ఉన్నట్టుగా చాలా సంవత్సరాల పాటు అనేక రకాల వార్తలు వచ్చాయి. అభినయకు హీరో విశాల్ అంటే చాలా ఇష్టం. తనకు మాటలు రాకపోయినా తన ప్రేమను విశాల్ పై ప్రతిసారి వ్యక్తపరిచేది. ఇక ఏమైందో తెలియదు అభినయ వేరే అబ్బాయిని కొద్ది రోజుల క్రితమే వివాహం చేసుకుంది. ఇక ఫైనల్ గా విశాల్ ప్రేమ వివాహం చేసుకుంటున్నారని తెలిసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు. పెళ్లి విషయం అనౌన్స్ చేయడంతో తన అభిమానులు సంతోషపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: