కోలీవుడ్ నటుడు శింబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈయ న ఇప్పటికే చాలా తమిళ సినిమాల లో నటించి మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు . శింబు నటించిన కొన్ని సినిమాలు తెలుగు లో కూడా డబ్ అయ్యి విడుదల అయ్యాయి . అందులో మన్మధ సినిమా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర మం చి విజయం సాధించడంతో ఈయన కు తెలుగు సినీ పరిశ్రమ లో కూడా మంచి గుర్తింపు లభించింది . కొన్ని సంవత్సరాల పాటు శింబు నటించిన చాలా సినిమా లు బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. దానితో ఈయన కెరియర్ గ్రాఫ్ కూడా చాలా పడిపోయింది.

అలాంటి సమయం లోనే ఈయన వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన మానాడు అనే సినిమాతో ప్రేక్షకులను ,  విమర్శకులను మెప్పించాడు. దానితో ఈయన తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. ఇకపోతే ప్రస్తుతం శంభు వరుస పెట్టి సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా కెరీర్ను ముందుకు సాగిస్తున్నాడు. తాజాగా శింబు , కమల్ హాసన్ హీరోగా త్రిష హీరోయిన్గా మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన థగ్ లైఫ్ మూవీ లో కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ జూన్ 5 వ తేదీన విడుదల కానుంది.

ఇకపోతే ఈ సినిమా విడుదల కాకముందే శింబు ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకుడి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి మణిరత్నం "థగ్ లైఫ్" సినిమా పనులన్నీ పూర్తి అయ్యాక శింబు హీరోగా ఓ మూవీ ని రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా థగ్ లైఫ్ సినిమా విడుదల కాగానే మొదలు కాబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: