ప్రముఖ నటి త్రిప్తి దిమ్రీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ భామ యానిమల్ సినిమాతో ఒక్కసారిగా తన రేంజ్ ను పెంచుకుంది. ఈ భామ ఇదివరకే బాలీవుడ్ లో అనేక సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. తనదైన నటన అందచందాలతో ప్రేక్షకుల మనసులను మెప్పించింది. కానీ హీరోయిన్ గా సక్సెస్ సాధించలేదు. ఇక యానిమల్ సినిమాలో ఈ చిన్నది కనిపించింది చాలా తక్కువ సమయమే ఆయనప్పటికీ తనదైన నటన, ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకుల మనసులను కట్టిపడేసింది. ఈ చిన్నది యానిమల్ సినిమా తర్వాత అనేక సినిమాలలో నటిస్తూ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగిస్తోంది. 

ఈ క్రమంలోనే ఈ చిన్నది ఏకంగా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని అందుకుంది. ఈ సినిమాలో నటించడానికి ఈ బ్యూటీ ఏకంగా నాలుగు కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లుగా ప్రచారాలు జరుగుతున్నాయి. యానిమల్ సినిమాకు త్రిప్తి దిమ్రీ కేవలం 40 లక్షల పారితోషికం మాత్రమే తీసుకుంది. ఇప్పుడు ఏకంగా తన రెమ్యూనరేషన్ 90 శాతానికి పెంచినట్లుగా తెలుస్తోంది. ఆమె మునుపటి పారితోషికం కన్నా 90% ఎక్కువగా పెంచేసింది. మరి ఈ చిన్నది అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సందీప్ రెడ్డి వంగా ఒప్పుకుంటారా లేదా అనే సందేహంలో కొంతమంది అభిమానులు ఉన్నారు.

ఈ సినిమాలో మొదట దీపికను హీరోయిన్ గా ఫైనల్ చేశారు. ఆమె స్పిరిట్ సినిమాలో నటించడానికి ఏకంగా 20 కోట్లకు పైనే రెమ్యూనరేషన్ అడిగినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు దీపికను తప్పించి త్రిప్తి దిమ్రీను హీరోయిన్ గా ఫైనల్ చేశారు. మరి ఈ భామకు ఈ సినిమాలో ఎంత రెమ్యూనరేషన్ ఇస్తారో లేదో చూడాలి. అంతేకాకుండా ఈ సినిమాలో ఈ భామకు సందీప్ రెడ్డి వంగా చాలా రకాల కండిషన్లు పెట్టినట్లుగా అనేక రకాల వార్తలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వీటిపై ఈ చిన్నది ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: